Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tim Paine బావ కూడా అదే మహిళతో ‘సెక్స్‌టింగ్’ చేశాడట!

Tim Paine’s brother-in-law ‘sexting’ probe with same woman

సిడ్నీ: ఓ మహిళతో జరిపిన అసభ్యకర చాటింగ్ వెలుగులోకి రావడంతో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పెయిన్ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 2017లో సహచర ఉద్యోగినితో చేసిన 'సెక్స్‌టింగ్' (సెక్స్ చాటింగ్) ఆస్ట్రేలియా మీడియాలో ప్రచారం కావడంతో పెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతని బావ కూడా ఇదే మహిళతో సెక్స్‌టింగ్ చేశాడని తాజాగా వెలుగులోకి వచ్చింది.

హెరాల్డ్ సన్ కథనం ప్రకారం టిమ్ పెయిన్ సోదరి భర్త అయిన టబ్.. పెయిన్ చాట్ చేసిన మహిళతోనే అసభ్యకర చాటింగ్ చేసాడట. దాంతోనే అడిలైడ్ ప్రిన్స్ అల్ఫెర్‌డ్ కాలేజీలో కోచ్‌గా ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడని, క్రికెట్ టస్మానియా నుంచి కూడా తప్పుకున్నాడట. అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపగా.. సదరు మహిళతో సెక్స్‌టింగ్ చేసినట్లు తేలడంతో అతనిపై చర్యలు తీసుకున్నారని హెరాల్ట్ సన్ తన కథనంలో పేర్కొంది.

ఇక తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బయటకు వస్తాయని తనకు ముందే తెలుసని టిమ్‌పైన్‌ తెలిపాడు. తాజాగా అతను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించాడు. తొలుత ఈ వివాదం సమసిపోయిందని భావించినా.. పెద్ద సిరీస్‌లు లేదా తమ క్రికెట్‌ సీజన్‌ మొదలయ్యేముందు ప్రతిసారీ ఈ వివాదం తన దృష్టికి వస్తూనే ఉందన్నాడు.

తన సందేశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తరచూ హెచ్చరించేవని స్పష్టం చేశాడు. అయితే, వాళ్లు ఎప్పుడూ దీనిపై వార్తలు ప్రసారం చేయకపోయినా.. ఎప్పుడైనా ఈ వివాదం బయటకు పొక్కుతుందనే విషయం తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చాడు. ఇదంతా తాను టెస్టు కెప్టెన్సీ చేపట్టక కొన్ని నెలల ముందు జరిగిందని, అది తమ ఇద్దరి అంగీకారంతో జరిగిన వ్యవహారమని పైన్‌ వివరించాడు. అప్పుడు తన కెప్టెన్సీకి ఇది సమస్యగా పరిణమిస్తుందనే విషయం గురించి ఆలోచించలేదన్నాడు.

2018లో అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని నిషేధానికి గురైన విపత్కర పరిస్థితుల్లో టిమ్ పైన్‌ ఆస్ట్రేలియా టెస్ట్ పగ్గాలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మూడేళ్లు కెప్టెన్‌గా కొనసాగి చివరికి ఇలా రాజీనామా చేశాడు. అయితే వచ్చేనెల 8 నుంచి ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా టీమ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ మెగా టోర్నీకి ముందు పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఆ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. టిమ్ పైన్ అనూహ్య నిర్ణయంతో ఆసీస్ జట్టును వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నడిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే
65 ఏళ్ల తర్వాత ఓ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాకు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

Story first published: Sunday, November 21, 2021, 17:25 [IST]
Other articles published on Nov 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+