స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నట్లు ఊహించుకుని అలా చేశాడు.. అతడు ఛీటర్ కాదు: టిమ్ పైన్

సిడ్నీ: ఎదో ఒకటి చేసి విజయం సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు మొదటినుంచి అలవాటే. ప్రత్యర్థి ఆటగాళ్లపై గొడవకు దిగి విజయాలు అందుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో నోటికి పని చెప్పే ఆసీస్ ఆటగాళ్లు.. ఇప్పుడు కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సిడ్నీ టెస్టులో భారత్ గెలుస్తుందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చిల్లరవేషాలు వేశాడు. టీమిండియా యువ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (97; 118 బంతుల్లో 12x4, 3x6) చేసుకున్న బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను చేరిపేసి విమర్శల పాలయ్యాడు. అయితే స్మిత్ అలా చేయలేదని ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ అంటున్నాడు.

స్మిత్‌తో మాట్లాడా:
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్.. టెస్టుల్లో స్టీవ్ స్మిత్ తరచూ క్రీజు వద్దకు వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడని, ఈ క్రమంలోనే తనకు అనుకూలంగా గార్డ్ మార్క్‌ను మార్చుకుంటాడని చెప్పాడు. 'గార్డ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ విషయంపై నేను స్మిత్‌తో మాట్లాడాను. అయితే ఆ వీడియో మరో విధంగా వైరల్ కావడంతో అతడు చాలా బాధపడుతున్నాడు. స్మిత్ టెస్టు క్రికెట్ ఆడటం మీరు చూస్తే.. ప్రతీ మ్యాచ్‌లో రోజుకు ఐదారు సార్లు అలా చేస్తాడు. అయితే ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను అతడు చెరిపేయలేదు' అని అన్నాడు.

బ్యాటింగ్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడు:
'ఒకవేళ రిషభ్ పంత్ బ్యాటింగ్ గార్డ్ మార్క్‌ను స్టీవ్ స్మిత్ చెరిపివేస్తే.. టీమిండియా దీనిపై ఫిర్యాదు చేసేది. కానీ అలా చేయలేదు. అయితే స్మిత్ అలా క్రీజు వద్దకెళ్లి అతడే బ్యాటింగ్ చేస్తున్నట్లు గార్డ్ మార్క్‌ను మార్చుకోవడం నేను చాలాసార్లు చూశాను' అని టిమ్ పైన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో ఇంకా తన దుర్బుద్ధిని మార్చుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా అప్పటి కెప్టెన్‌గా ఉన్న స్మిత్.. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పుడు డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ (9 నెలలు)తో సహా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు.

డ్రింక్స్ బ్రేక్స్ సమయంలో:
సోమవారం 98/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ అజింక్య రహానే (4) వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన రిషబ్ పంత్.. చెటేశ్వర్ పుజారా అండతో ధాటిగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే తొలి సెషన్‌లో డ్రింక్స్ బ్రేక్స్ సందర్భంగా స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ క్రీజు వద్దకు వచ్చి పంత్ చేసుకున్న మార్క్‌ను చెరిపేశాడు. అదంతా బెయిల్స్ కెమెరాకు చిక్కడంతో విషయం బయటకు తెలిసింది. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పంత్ చితక బాదుతుంటే.. తట్టుకోలేకపోయిన స్మిత్ చిల్లరవేషాలకు పోయాడని అందరూ విమర్శించారు.

చీటర్స్ ఎప్పుడూ చీటర్సే:
ఈ వీడియోపై సోమవారం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. 'స్టీవ్ స్మిత్ చిల్లరవేషాలు వేశాడు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'భారత్ మ్యాచ్ గెలుస్తుందనే స్మిత్ ఇలా చేశాడు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఏడాది బ్యాన్ పడ్డ క్రికెటర్.. మళ్లీ చీటింగ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు', 'ఏడాది నిషేధానికి గురైనా స్మిత్ ఏమాత్రం మారలేదుగా', 'చీటర్స్ ఎప్పుడూ చీటర్సే' అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇదేనా నీ క్రీడాస్ఫూర్తి అంటూ ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా ప్రశ్నించారు.
Sydney Test: డుప్లెసిస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా.. పట్టుదలగా బ్యాటింగ్ చేశా: అశ్విన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications