Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: డీఆర్‌ఎస్ నిర్ణయంపై టిమ్ పైన్ ఫైర్.. అంపైర్‌పై అసభ్యపదజాలం!

Tim Paine let loose abuse to umpire after DRS call involving Pujara gets turned down

సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ సహనం కోల్పోయాడు. అసభ్యపదజాలంతో అంపైర్‌ పాల్ విల్సన్‌పై నోరుపారేసుకున్నాడు. సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా క్యాచ్ ఔట్ విషయంలో డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ఆసీస్‌ భంగపాటుకు గురైంది. దాంతో సహనం కోల్పోయిన పైన్ ఫీల్డ్ అంపైర్ పాల్ విల్సన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 ఇంతకేం జరిగిందంటే..?

ఇంతకేం జరిగిందంటే..?

ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ వేసిన ఓవర్‌లో బంతి చతేశ్వర్ ప్యాడ్‌ను తాకి ఫీల్డర్ మాథ్యూవేడ్‌ చేతిలో పడింది. అయితే బ్యాట్‌కు తగిలినట్లు అనిపించడంతో ఆసీస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ తిరస్కరించగా.. ఆసీస్ సమీక్షకు వెళ్లింది. థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ పలుకోణాల్లో పరీక్షించి స్నీకో, హాట్ స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించలేదని, అంపైర్స్ కాల్ కింద నాటౌట్ ఇచ్చాడు. దాంతో పుజారా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు.

మొన్న ఔటిచ్చారుగా..?

మొన్న ఔటిచ్చారుగా..?

అయితే మెల్‌బోర్న్ టెస్ట్‌లో స్నికోలో కొంచెం స్పైక్ కనబడటంతో పైన్‌ను ఔటిచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పైన్.. అంపైర్ విల్సన్‌తో వాగ్వాదానికి దిగాడు. తాను థర్డ్ అంపైర్‌ను కాదని తానేం చేయలేనని విల్సన్ బదులిచ్చాడు. ఈ మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురైన పైన్.. అసభ్య పదజాలంతో అంపైర్‌ను దూషించాడు. మొన్న ఔట్ ఇచ్చి ఈ రోజు నాటౌట్ ఇవ్వడం ఏంటోనని అసహనం వ్యక్తం చేశాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. థర్డ్ అంపైర్ ఆఫ్ సైడ్ కూడా పరీశీలించాల్సిందని, కేవలం లెగ్ సైడ్ మాత్రం చూశాడని పైన్ అన్నట్లు వినిపించింది.

పైన్‌పై చర్యలు..?

పైన్‌పై చర్యలు..?

అయితే ఐసీసీ నిబంధనల మేరకు పైన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మైదానంలో అంపైర్లు, ఆటగాళ్లపై దూషణకు దిగినా, అసభ్య పదజాలాన్ని వాడిన సెక్సన్ 2.3, 2.8 కింద చర్యలు తీసుకుంటారు. అతని మ్యాచ్ ఫీజులో కోత పడే అవకాశం ఉంది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత అంపైర్లు ఈ ఘటనపై రిఫరీకి ఫిర్యాదు చేయవచ్చు. డీఆర్‌ఎస్ నిబంధనను మార్చాలని గత కొంత కాలంగా తీవ్ర చర్చ జరుగుతుంది. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ అంపైర్స్ కాల్‌ను తీసేయాలని కోరుతున్నారు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కూడా భారత్ పలు అవకాశాలను చేజార్చుకుంది.

భారత్ 244 ఆలౌట్

భారత్ 244 ఆలౌట్

96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఎదురీదుతోంది. చతేశ్వర్ పుజరా(50) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 244 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆసీస్‌కు 94 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆట ప్రారంభమైన ఆరంభంలోనే కెప్టెన్ అజింక్యా రహానే(22), హనుమ విహారీ(4) వికెట్లను భారత్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(36)‌తో నయావాల్ చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆ తర్వాత పంత్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. సిరాజ్ సాయంతో వీలైనన్నీ పరుగులు రాబట్టేందుకు జడేజా(28 నాటౌట్) ప్రయత్నించాడు.

Story first published: Saturday, January 9, 2021, 10:05 [IST]
Other articles published on Jan 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+