చేటేశ్వర్ పుజారానే టార్గెట్.. ఆస్ట్రేలియా కెప్టెన్‌కు జరిమానా!!

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కు జరిమానా పడింది. మూడోరోజు ఆటలో భారత ఆటగాడు చేటేశ్వర్ పుజారానే టార్గెట్ చేస్తూ డీఆర్‌ఎస్ కోరిన పైన్.. నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో ఫీల్డ్ అంపైర్ విల్సన్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ నిర్ణయానికి నిరసన తెలిపినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. పైన్‌కు జరిమానా వేసినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 'అంపైర్ నిర్ణయానికి అసంతృప్తిని తెలపడం ద్వారా ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.8ని పైన్ ఉల్లంఘించాడు. అందుకే అతనికి జరిమానాతో పాటు ఒక అయోగ్యత పాయింట్‌ను విధించాం' అని ఐసీసీ తెలిపింది

పుజారానే టార్గెట్:
విషయంలోకి వెళితే... ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా (50: 176 బంతుల్లో 5x4) బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే పుజారా ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి అతని శరీరాన్ని తాకింది. అనంతరం షార్ట్ లెగ్‌లో గాల్లోకి లేవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వేడ్ క్యాచ్ అందుకున్నాడు. ఔట్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. కానీ ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్‌ఎస్ కోరాడు.

మైదానంలోనే బూతు పురాణం:
రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకినట్లు హాట్‌స్పాట్, స్నికో మీటర్‌లో కనిపించలేదు. దాంతో థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను తన నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ సహనం కోల్పోయి మైదానంలోనే బూతు పురాణం మొదలెట్టాడు. పైన్ మాటల్ని విన్న అంపైర్ విల్సన్ తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా పైన్ వినకపోవడంతో.. విల్సన్ కూడా ధీటుగా బదులివ్వాల్సి వచ్చింది. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కి ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు.

మ్యాచ్ ఫీజులో కోత:
మైదానంలో టీమ్ పైన్ వ్యవహరించిన తీరుపై ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు ఫిర్యాదు చేశారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద పైన్ మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధిస్తూ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పాటు పైన్ క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు. 24 నెలల కాలంలో పైన్ చేసిన మొదటి తప్పు ఇదేనని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. లెవల్-1 తప్పిదం కింద అధికారిక మందలింపు, ఆటగాడి మ్యాచ్ ఫీజులో గరిష్ఠంగా 50 శాతం జరిమానా విధించొచ్చు. దీంతో పాటు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు వేసే అధికారం రిఫరీకి ఉంది.
Sydney Test: లంచ్ బ్రేక్.. పంత్ హాఫ్ సెంచరీ.. గెలవాలంటే 201 కొట్టాలి!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications