Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sydney Test: లంచ్ బ్రేక్.. పంత్ హాఫ్ సెంచరీ.. గెలవాలంటే 201 కొట్టాలి!!

Rishabh Pant, Cheteshwar Pujara keep Australia at bay with century stand in Sydney Test

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ పూర్తి రసవత్తరంగా మారింది. సొంత గ‌డ్డ‌పై ఆస్ట్రేలియా విజృంభిస్తుంటే.. టీమిండియా కూడా వాళ్లకు ధీటుగా రాణిస్తున్నారు. చివరి రోజు ఉదయం రహానే సేన తొలుత తడబడ్డా.. ఆపై కంగారుల బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచును తమ చేతుల్లోకి తీసుకుంది. భోజన విరామ సమయానికి భారత్‌ 70 ఓవర్లలో 206/3తో నిలిచింది. తొలి సెషన్‌లో ఒక వికెట్‌ కోల్పోయి 108 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్ ‌(73; 97 బంతుల్లో 8x4, 3x6), చేటేశ్వర్ పుజారా (41; 147 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు.

ఆదిలోనే భారీ షాక్ :

ఆదిలోనే భారీ షాక్ :

సోమవారం ఉదయం 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ అజింక్య రహానే (4) తన వ్యక్తిగత ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్దే ఔట్ అయ్యాడు. ఈరోజు ఉదయం రెండో ఓవర్లోనే ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్.. స్పిన్నర్ నాథన్ లైయాన్ చేతికి బంతినిచ్చాడు. అది ఫలితాన్నిచ్చింది. లైయాన్ తన తొలి ఓవర్ నాలుగో బంతికే రహానేను ఔట్ చేశాడు. బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వేడ్ చేతుల్లో పడింది. దీంతో భారత్‌ 102 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది.

64 బంతుల్లోనే పంత్ హాఫ్ సెంచరీ:

ఆపై క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తొలుత ఆచితూచి ఆడాడు. నాథన్ లైయాన్ బౌలింగ్‌లో ఆదిలోనే వికెట్ కీపర్ టీమ్ పైన్ ఓ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్.. నెమ్మదిగా గేర్ మార్చాడు. స్టార్క్, లైయాన్‌ను‌ టార్గెట్‌గా ఆడాడు. ముఖ్యంగా లైయాన్ బౌలింగ్‌లోనే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. లైయాన్ వేసిన 57వ ఓవర్ మూడో బంతికి సింగల్ తీసిన పంత్.. అర్ధ శతకం మార్క్ అందుకున్నాడు. వన్డే తరహాలో ఆడుతూ.. 64 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేయడం విశేషం.

పుజారా సమన్వయ బాటింగ్:

పుజారా సమన్వయ బాటింగ్:

హాఫ్ సెంచరీ అనంతరం పైన్ మరోసారి పంత్ క్యాచ్ వదిలేశాడు. ఆపై బౌండరీలు బాదుతూ.. భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు చేటేశ్వర్ పుజారా అతనికి మంచి సహకారం అందిస్తున్నాడు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు బాదుతూ అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 104 పరుగుల శతక భాగస్వామ్యం జోడించారు. పంత్ ముందు ఆసీస్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పంత్ దూకుడు, పుజారా సమన్వయ బాటింగ్‌తో టీమిండియా లక్ష్యం దిశగా దూసుకెళుతోంది.

గెలవాలంటే 201 కొట్టాలి:

గెలవాలంటే 201 కొట్టాలి:

భోజన విరామ సమయానికి భారత్‌ 70 ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. చేటేశ్వర్ పుజారా (41), రిషబ్ పంత్ (73) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, హాజిల్ వుడ్, లైయాన్ తలో వికెట్ తీశారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 201 పరుగులు చేయాలి. రెండో సెషన్ పుజారా, పంత్ జోడి బాగా ఆడితే.. దాదాపు విజయం సాధించినట్టే.

నోరు పారేసుకున్న కెప్టెన్‌.. టీమ్‌ నుంచి వెళ్లిపోయిన వైస్ కెప్టెన్‌!! ఆ టీమిండియా ఆటగాళ్లు ఎవరంటే?

Story first published: Monday, January 11, 2021, 7:56 [IST]
Other articles published on Jan 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+