Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: ఎలాంటి సందేహం లేదు.. ఫైనల్లో టీమిండియానే విజేత: ఆసీస్ కెప్టెన్

Tim Paine feels Indian Team to win comfortably WTC final 2021
Tim Paine Picks Winner Of WTC Final | Teamindia లా బలపడాలి ! || Oneindia Telugu

సిడ్నీ: జూన్ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఆస్ట్రేలియా గతేడాది తన సొంత గడ్డపై భారత్‌, న్యూజిలాండ్‌ జట్లతో టెస్టు సిరీస్‌లో తలపడిన సంగతి తెలిసిందే. కివీస్‌పై గెలుపొందిన ఆసీస్.. టీమిండియాపై 1-2 తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలోనే భారత్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే.. కచ్చితంగా గెలుస్తుందని పైన్‌ చెప్పుకొచ్చాడు.

టీమిండియానే విజేత

టీమిండియానే విజేత

బ్రిస్బేన్‌లో తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్‌ పైన్ మాట్లాడుతూ... 'నా అంచనా ప్రకారం టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా ఆడితే చాలు. ఇక కివీస్ కూడా పటిష్టంగానే ఉంది. ఇంగ్లండ్ జట్టును దాని సొంతగడ్డపై ఓడించింది. ఇంగ్లీష్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్స్ తుది జట్టులో ఆడలేదు' అని అన్నాడు. డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి

బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలి

భారత్ లాగే ఆస్ట్రేలియా జట్టు సైతం బలమైన బ్యాకప్‌ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని టిమ్‌ పైన్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ మరికొద్ది రోజుల్లో వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో పలువురు సీనియర్‌ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌ ప్రస్తుతం విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. వచ్చే నెలలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం శిఖర్ ధావన్‌ నేతృత్వంలోని మరో జట్టు బయలుదేరి వెళ్లనుంది. ఈ క్రమంలోనే తమ జట్టును కూడా ఎక్కువ మంది ఆటగాళ్లతో బలంగా తీర్చిదిద్దాలని పైన్‌ చెప్పుకొచ్చాడు.

Wimbledon 2021లో అభిమానులకు అనుమతి.. ఫైన‌ల్స్‌కు స్టేడియం ఫుల్‌!!

మేము భారత్ లాంటి స్థితికి చేరుకోవాలి

మేము భారత్ లాంటి స్థితికి చేరుకోవాలి

'ఇప్పుడు ఆసీస్ జట్టును మరింత బలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా అయితే సీనియర్లు ఆడకున్నా పెద్దగా నష్టం వాటిల్లదు. ఇప్పుడు టీమిండియాను మనం అలాగే చూస్తున్నాం. వాళ్లు జట్టును బ్యాలెన్స్‌ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు నాణ్యమైన ఆటగాళ్లు దొరకడంతో టెస్టు క్రికెట్‌ కూడా ఆడగలరు. మేం కూడా అలాంటి స్థితికి చేరాల్సి ఉంది. దాంతో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే.. వారు తిరిగి ఆడేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అప్పుడు మరింత బాగా ఆడతారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ పటిష్టంగా ఉండడంతోనే టీమిండియాకు బలమైన జట్టు సాధ్యమైంది' అని పైన్‌ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, June 15, 2021, 18:46 [IST]
Other articles published on Jun 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+