Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: తెలుగోడి విధ్వంసం.. ముంబై ఇండియన్స్ ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్‌‌ను చిత్తు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ భారీ విజయంతో ముంబై రన్‌రేట్ మెరుగైంది.

తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో యువ బౌలర్ అశ్వని కుమార్ నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ(45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.

Tilak Varma Unbeaten Century and Ashwani Kumar 4 Wicket Haul Helps MI beat GT by 99 Runs in IPL 2026

అనంతరం గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 5 ఫోర్లతో 26) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అశ్వని కుమార్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/16), అల్లా ఘజన్‌ఫర్(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. వరుసగా మూడు విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ జోరుకు ముంబై బ్రేక్ వేసింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..

గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్ ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ ఓవర్‌లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా ఐదు బంతులను 6, 4, 4, 6, 6 బౌండరీలకు తలించి 26 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి బంతిని అంచనా వేయడంలో విఫలమైన తిలక్ వర్మ తీవ్రంగా గాయపడ్డాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేసిన ఆఖరి బంతి అతని ప్రైవేట్ పార్ట్ భాగంలో బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు.

అయితే ఈ గాయం అతని దూకుడుకు అడ్డుగా నిలవలేదు. ఈ ఓవర్‌తో మూమెంటమ్ అందుకున్న తిలక్ వర్మ మరో 7 బంతుల్లో రెండు సిక్స్‌లు, మూడు బౌండరీలు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌కు ముందు ముంబై ఇండియన్స్ 141/4 స్కోర్‌తో నిలిచింది. అశోక్ వర్మ కాస్త కట్టడిగా వేసి ఉంటే ముంబై 165-170 పరుగులకే పరిమితమయ్యేది. కానీ తిలక్ వర్మ తన విధ్వంసతో మ్యాచ్‌ను మలుపు తిప్పి భారీ విజయాన్ని అందించాడు.

Story first published: Monday, April 20, 2026, 23:15 [IST]
Other articles published on Apr 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+