For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తిలక్ వర్మ.. రోహిత్ శర్మ రోగం పట్టిందా? మొన్న గోల్డెన్ డక్.. నేడు సిల్వర్ డక్!

న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ(1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన తిలక్ వర్మ.. తాజాగా రెండో టీ20లో సిల్వర్ డక్ అయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ షార్ట్ పిచ్ బాల్‌కే వెనుదిరగడం విశేషం.

మెక్‌కార్తీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో పుల్ షాట్ ఆడబోయిన తిలక్ వర్మ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన తిలక్ వర్మపై అభిమానులు మండిపడుతున్నారు. తిలక్ వర్మపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే అతను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడని మండిపడుతున్నారు.

Tilak Varma

ఈ పర్యటనకు ముందే వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. కీలక ఆటగాళ్లంతా విఫలమైన వేళ అద్భుతంగా ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో తిలక్ వర్మను ఆసియాకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని, టీమిండియా నాలుగో స్థానానికి అతనే సరైనోడని మాజీ క్రికెటర్లు సూచించారు.

లెఫ్టాండర్ కావడం అతనికి కలిసొచ్చే అంశమని, యువరాజ్ సింగ్ స్థానాన్ని అతను భర్తీ చేయగలడని ధీమా వ్యక్తం చేశారు. కానీ తిలక్ వర్మ మాత్రం పసికూన ఐర్లాండ్ బౌలింగ్‌ను ఆడలేకపోతున్నాడు. దాంతో అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు తిలక్ వర్మ ఆటతీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. తొలి టీ20లో గోల్డెన్ డకౌటైనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో టీ20లో కూడా అదే తరహాలో వెనుదిరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తిలక్ వర్మ చేజేతులా తన కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నాడని, ఈ రెండు మ్యాచ్‌ల్లో రాణించి ఉంటే ఆసియాకప్ 2023 జట్టులో చోటు దక్కించుకునేవాళ్లని కామెంట్ చేస్తున్నారు. మెచ్చుకుంటే ఇచ్చుకుపోవడం అంటే ఇదేనని సెటైర్లు పేల్చుతున్నారు. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ పుల్ షాట్ రోగం తిలక్ వర్మకు కూడా పట్టిందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 58)హాఫ్ సెంచరీతో రాణించగా.. రింకూ సింగ్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరికి తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), శివమ్ దూబే(16 బంతుల్లో 2 సిక్స్‌లతో 22 నాటౌట్) రాణించారు.

ఐర్లాండ్ బౌలర్లలో బారీ మెక్‌కార్తీ రెండు వికెట్లు తీయగా.. మార్క్ అడైర్, క్రైగ్ యంగ్, బెంజమన్ వైట్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, August 20, 2023, 21:50 [IST]
Other articles published on Aug 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+