Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలకంతో వన్డే సిరీస్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ!

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత్-ఏ వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కింది. రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

జూన్ 9 నుంచి శ్రీలంక-ఏ, అఫ్గానిస్థాన్-ఏ, భారత్-ఏ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీ జూన్ 21న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈ ముక్కోణపు వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక ఏతో భారత ఏ జట్టు రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది. వైట్ బాల్ సిరీస్ దంబుల్లాలో, రెడ్ బాల్ మ్యాచ్‌లు గాలే వేదికగా జరగనున్నాయి.

Tilak Varma to Lead India A in Sri Lanka Tri-Series Vaibhav Sooryavanshi Priyansh Arya Earns Call-up

వైభవ్ సూర్యవంశీతో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్రియాన్ష్ ఆర్య, సూర్యాంశ్ షెడ్డే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అన్షుల్ కంబోజ్‌లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. 11 మ్యాచ్‌ల్లో 236.56 స్ట్రైక్-రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 40 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 175 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్‌ను టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అతన్ని భారత్-ఏ జట్టుకు ఎంపిక చేసినట్లు అర్థమవుతుంది. ఈ ముక్కోణపు సిరీస్‌లో సత్తా చాటితే వైభవ్.. టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు.

శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత్-ఏ జట్టు: తిలక్ వర్మ(కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సంధు, హర్ష్ దూబే, సూర్యంశ్ షెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్రా(కీపర్), విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.

Story first published: Thursday, May 14, 2026, 22:18 [IST]
Other articles published on May 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+