Duleep Trophy 2026: తిలక్ వర్మ శతకం.. సౌత్ జోన్‌కు భారీ ఆధిక్యం!
టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ(225 బంతుల్లో 7 ఫోర్లతో 106 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో అజేయ సెంచరీతో సత్తా చాటాడు.
బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై తిలక్ వర్మ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో సౌత్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యం లభించింది. తిలక్ వర్మతో పాటు శ్రేయస్ గోపాల్(169 బంతుల్లో 11 ఫోర్లతో 87) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 94 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగులు చేసింది. నార్త్ జోన్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్(4/70) నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ తలో రెండు వికెట్లు తీసారు.

80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ.. శ్రేయస్ గోపాల్‌తో కలిసి ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 175 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీ ముంగిట శ్రేయస్ గోపాల్ ఔటైనా.. టెయిలెండర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ వర్మ అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న తిలక్ వర్మపై ప్రశసంల జల్లు కురుస్తుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 59.1 ఓవర్లలో 195 పరుగులకు కుప్పకూలింది. ఖమ్రాన్ ఇక్బాల్(182 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కన్హయ వధవాన్(35) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో విద్వత్ కావేరప్ప(4/64) నాలుగు వికెట్లు తీయగా.. నిదీష్(2/36), తనయ్ త్యాగరాజన్(2/31) రెండేసి వికెట్లు పడగొట్టారు. కావురి సాయితేజ, శ్రేయాస్ గోపాల్‌కు చెరో వికెట్ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్ 195 ఆలౌట్ ఖమ్రాన్ ఇక్బాల్(182 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76, విద్వత్ కావేరప్ప 4/64)
సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ 285/9 (తిలక్ వర్మ 106 బ్యాటింగ్, గుర్నూర్ బ్రార్ 4/70)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

