Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Varma: తెలుగోడి విధ్వంసం.. 12 బంతుల్లోనే సెంచరీ మార్క్! (వీడియో)

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ(45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయం శతకంతో సత్తా చాటాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ తెలుగు తేజం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యాతో కలిసి ఆదుకున్నాడు.

బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై గుజరాత్ బౌలర్లను ఊచకోత కోసాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న తిలక్ వర్మ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ మరో 12 బంతుల వ్యవధిలోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ 12 బంతుల్లో తిలక్ వర్మ 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదడం విశేషం. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను 6, 4 తరలించి తిలక్ వర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తిలక్ వర్మకు ఇదే తొలి సెంచరీ. సెంచరీ అనంతరం తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.

Tilak Varma Smashes Maiden IPL Century With Explosive Finish Against GT in IPL 2026

ఒకే ఓవర్‌లో 5 బౌండరీలు..

యువ పేసర్ అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో తొలి బంతిని సిక్స్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్ వర్మ.. తర్వాత నాలుగు బంతుల్లో 4, 4, 6, 6 బాదాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేసిన ఆఖరి బంతి అతని ప్రైవేట్ పార్ట్ భాగంలో బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియోల సాయంతో నొప్పిని భరిస్తూ బ్యాటింగ్ కొనసాగించిన తిలక్.. ఆఖరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు బౌండరీలు బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ముంబై ఇండియన్స్‌కు 199 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

హార్దిక్ వ్యాఖ్యలతో..

స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లో తిలక్ వర్మను తన మాటలతో హార్దిక్ పాండ్యా రెచ్చగొట్టాడు. అతను ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ.. ఆ తర్వాతి ఓవర్‌లోనే తిలక్ వర్మ ఉగ్రరూపం చూపించాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు తిలక్ వర్మ 81 పరుగులు జోడించాడు. తిలక్‌తో పాటు నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు.

Story first published: Monday, April 20, 2026, 21:42 [IST]
Other articles published on Apr 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+