టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్‌లో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‌ను తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. ఛేజింగ్‌లో కనీసం 500 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తిలక్ వర్మ 68 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. 16 టీ20ల్లో ఛేజింగ్ చేసిన తిలక్ వర్మ 543 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 48 టీ20ల్లో ఛేజింగ్ చేసి 2013 పరుగులు నమోదు చేశాడు.
ఈ జాబితాలో తిలక్ వర్మ తర్వాత విరాట్ కోహ్లీ(67.1 సగటు), మహేంద్ర సింగ్ ధోనీ(47.71), జేపీ డుమినీ(45.55), కుమార సంగక్కర(44.93) తర్వాతి స్థానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ 25 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఫీట్ సాధించాడు. తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

టీ20ల్లో ఒక జట్టుపై అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్‌గానూ తిలక్ వర్మ నిలిచాడు. కనీసం 300 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సౌతాఫ్రికాపై తిలక్ వర్మ 70.50 సగటుతో టాప్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ 70.28, శ్రీలంకపై విరాట్ కోహ్లీ 67.8, వెస్టిండీస్‌పై కేఎల్ రాహుల్ 58.83, వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీ 57 సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో తిలక్ వర్మ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 62 పరుగులతో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 117 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో డోనవన్ ఫెర్రెయిరా(15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20), అన్రిచ్ నోర్జ్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/25), హర్షిత్ రాణా(2/34), వరుణ్ చక్రవర్తీ(2/11), కుల్దీప్ యాదవ్(2/12) రెండేసి వికెట్లతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 120 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) తన జోరు కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 28), సూర్యకుమార్ యాదవ్(11 బంతుల్లో 2 ఫోర్లతో 12) మరోసారి తడబడ్డారు. తిలక్ వర్మ(34 బంతుల్లో 3 ఫోర్లతో 26 నాటౌట్), శివమ్ దూబే(4 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 10 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.