For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తిలక్ వర్మ విధ్వంసం.. 8 సిక్సర్లతో వీర విహారం!

టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. నవీ ముంబై వేదికగా జరుగుతన్న డీవై పాటిల్ టీ20 టోర్నీలో రిలయన్స్ 1 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. సెంట్రల్ రైల్వేతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో రిలియన్స్ 1 ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో సెంట్రల్ రైల్వేను ఓడించింది.

Tilak Varma scored

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రిలయన్స్ 1 నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ(43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 91 నాటౌట్), శ్వాలిక్ శర్మ(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సెంట్రల్ రైల్వేస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులే చేసి ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో మెరిసిన తిలక్ వర్మ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. ఓ వికెట్ తీసాడు.

ఇన్‌కమ్ టాక్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో డీవై పాటి రెడ్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇన్‌కమ్ టాక్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. డీవై పాటి రెడ్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/30), వరుణ్ చక్రవర్తీ(3/31), కృనాల్ పాండ్యా(2/33) తలో రెండు వికెట్లు తీసారు.

అనంతరం డీవై పాటిల్ రెడ్స్ టీమ్ 15 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసి గెలుపొందింది. ఆమన్ ఖాన్(89 నాటౌట్), నితీష్ రాణా(37) రాణించారు.

Story first published: Wednesday, February 28, 2024, 22:26 [IST]
Other articles published on Feb 28, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+