Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy 2026: గెలిపించిన తిలక్ వర్మ.. ఫైనల్‌కు సౌత్ జోన్!

ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ముగిసిన సెమీఫైన్-2లో సమష్టిగా రాణించిన సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్ జోన్‌ను ఓడించింది. కెప్టెన్ తిలక్ వర్మ(116 నాటౌట్, 51 నాటౌట్) అద్వితీయమైన బ్యాటింగ్‌తో సౌత్‌ జోన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Duleep Trophy 2026: గెలిపించిన వైభవ్ సూర్యవంశీ.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఈస్ట్ జోన్!

Duleep Trophy 2026: గెలిపించిన వైభవ్ సూర్యవంశీ.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఈస్ట్ జోన్!

181 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లకు 182 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ(79 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ స్మరణ్(32 నాటౌట్), నారయణ జగదీషన్(43), రికీ భూయ్(42) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో అబిద్ ముస్తాక్ రెండు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టాడు.

Tilak Varma Powers South Zone to Duleep Trophy Final With Match-Winning Show Against North Zone

నార్త్ జోన్ 297 ఆలౌట్..

అంతకుముందు 256/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్ 297 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 41 పరుగులు మాత్రమే జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. సనత్ సంగ్వాన్(148 బంతుల్లో 8 ఫోర్లతో 76), ఆయుష్ డోసెజా(76 బంతుల్లో 5 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలో రాణించారు. ఓవర్‌నైట్ బ్యాటర్ అన్షుల్ కాంబోజ్ 36 పరుగులే చేశాడు. సౌత్ జోన్ బౌలర్లలో నిదీష్(5/56) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. కావురి సాయితేజ, శ్రేయాస్ గోపాల్ తలో రెండో వికెట్లు పడగొట్టారు. విద్వత్ కావేరప్ప ఒక వికెట్ తీసాడు.

తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్‌కు 117 పరుగుల ఆధిక్యం దక్కడంతో లక్ష్యం 182 పరుగులే అయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 59.1 ఓవర్లలో 195 పరుగులకు కుప్పకూలింది. ఖమ్రాన్ ఇక్బాల్(182 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కన్హయ వధవాన్(35) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో విద్వత్ కావేరప్ప(4/64) నాలుగు వికెట్లు తీయగా.. నిదీష్(2/36), తనయ్ త్యాగరాజన్(2/31) రెండేసి వికెట్లు పడగొట్టారు. కావురి సాయితేజ, శ్రేయాస్ గోపాల్‌కు చెరో వికెట్ దక్కింది.

తిలక్ వర్మ అజేయ శతకం..

అనంతరం సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 312 పరుగులకు కుప్పకూలింది. తిలక్ వర్మ(250 బంతుల్లో 9 ఫోర్లతో 116 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ గోపాల్(169 బంతుల్లో 11 ఫోర్లతో 87) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్ (4/88) నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అబిద్ ముస్తాక్‌కు ఒక వికెట్ దక్కింది.

IND vs AFG: సంజూ‌కు నో ఛాన్స్.. నితీష్ రెడ్డి డౌట్! అఫ్గా‌న్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs AFG: సంజూ‌కు నో ఛాన్స్.. నితీష్ రెడ్డి డౌట్! అఫ్గా‌న్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకం.. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్‌ అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

Story first published: Wednesday, September 2, 2026, 15:08 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+