For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తిలక్ వర్మకు ప్రమోషన్!

టీమిండియా యువ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రమోషన్ దక్కింది. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో తిలక్ వర్మ.. హైదరాబాద్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఈ మెగా దేశవాళీ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) ప్రకటించింది.

16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను హెచ్‌సీఏ సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. మరో ఏడుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తిలక్ వర్మను హెచ్‌సీఏ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గత సీజన్‌లోనే తిలక్ వర్మకు సారథ్య బాధ్యతలు దక్కాయి.

Tilak Varma named Hyderabad captain in Ranji Trophy 2024

అప్‌కమింగ్ సీజన్‌లోనే అతన్నే కెప్టెన్‌గా హెచ్‌సీఏ కొనసాగించింది. తిలక్ వర్మకు డిప్యూటిగా రాహుల్ సింగ్ గహ్లోత్ వ్యవహరించనున్నాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఎలైట్ డివిజన్‌లో పోటీ పడ్డ హైదరాబాద్ తమ గ్రూప్‌లో చివరి స్థానంలో నిలవడంతో ఈసారి ప్లేట్ డివిజన్‌లో పోటీ పడనుంది.
ప్లేట్ డివిజన్‌లో హైదరాబాద్‌తో పాటు సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ జట్లు ఉన్నాయి. హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 5 నుంచి నాగాలాండ్‌తో, రెండో మ్యాచ్‌ను జనవరి 12 నుంచి మేఘాలయతో ఆడనుంది.

హైదరాబాద్ రంజీ జట్టు: తిలక్ వర్మ(కెప్టెన్), రాహుల్ సింగ్ గహ్లోత్(వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్ రాయుడు, టీ రవితేజ, తనయ్ త్యాగరాజన్, చందన్ సహని, కార్తికేయ కక్, నితేశ్ కన్నల, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సాకేత్ సాయిరామ్, అభిరత్ రెడ్డి, సాగర్ చౌరాసియా, ఇ. సంకేత్.

స్టాండ్‌బైస్: రాహుల్ బుద్ది, జావీద్ అలీ, యశ్ గుప్తా, రిషభ్ బస్లాస్, టీపీ అనిరుధ్, గణేశ్.

సపోర్ట్ స్టాఫ్: డీబీ రవితేజ(హెడ్ కోచ్), పవన్ కుమార్(అసిస్టెంట్ కోచ్), రొనాల్డ్ రోడ్రిగ్స్(ఫీల్డింగ్ కోచ్), రియాజ్ ఖురేషి(టీమ్ మేనేజర్), సుభాశ్ పాత్రో(స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్), సంతోష్(ఫిజియో), కృష్ణా రెడ్డి(వీడియో ఎనలిస్ట్), సాజిద్ హుస్సేన్(మసాజర్)

Story first published: Sunday, December 31, 2023, 9:18 [IST]
Other articles published on Dec 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+