Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా తిలక్ వర్మ!

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును టీమిండియా స్టార్ బ్యాటర్, తెలుగు తేజం తిలక్ వర్మ నడిపించనున్నాడు. ఢిల్లీతో అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న తిలక్ వర్మను తిరిగి కెప్టెన్‌గా నియమించింది. అతనికి రాహుల్ సింగ్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

ఈ రంజీ ట్రోఫీకి టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్ప‌ీ మహమ్మద్ సిరాజ్ దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ నుంచి సిరాజ్‌కు విశ్రాంతి కల్పించారు. హైదరాబాద్ జట్టులో సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమ తేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

Tilak Varma Named Captain as Hyderabad Announces Ranji Trophy 2025-26 Squad

నితేష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షన్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్ స్టాండ్‌బైలుగా ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌కు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో అతను రెండో రంజీ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బీలో ఆడిన హైదరాబాద్ జట్టు 7 మ్యాచ్‌లకు 2 మాత్రమే గెలిచింది. మరో 2 మ్యాచ్‌లను డ్రా చేసుకొని మూడింటిలో ఓడింది. లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కనీసం ఈ సారైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

హైదరాబాద్ రంజీ టీమ్:

తిలక్ వర్మ(కెప్టెన్), రాహుల్ సింగ్(వైస్ కెప్టెన్), సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, ఎం. అభిరథ్ రెడ్డి, హిమతేజ, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, శరణు నిశాంత్, పున్నయ్య, అనికేత్ రెడ్డి, కార్తికేయ కాక్, అలీ కాచి డైమండ్ (వికెట్ కీపర్), రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్).

స్టాండ్‌బై ఆటగాళ్లు :

పి. నితీష్ రెడ్డి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, నితేష్ కనాలా, మిఖిల్ జైస్వాల్.

Story first published: Thursday, October 9, 2025, 6:55 [IST]
Other articles published on Oct 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+