హార్దిక్ కాదు.. అతని వల్లే ఈ సెంచరీ: తిలక్ వర్మ
నమన్ ధీర్ సహకారంతోనే సెంచరీ చేయగలిగానని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో నమన్ ధీర్ అద్భుతంగా ఆడాడని, అతని ఇన్నింగ్స్ తనతో పాటు జట్టుకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపాడు. ఓవైపు తాను స్లోగా ఆడినా.. నమన్ ధీర్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరుగులు రాబట్టాడని చెప్పాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తిలక్ వర్మ(45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకంతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ పాండ్యాతో కలిసి హార్దిక్ ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్నా..
ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తిలక్ వర్మ.. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. 'తొలి సెంచరీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ విజయం మా జట్టుకు చాలా అవసరం. ఇక్కడి నుంచి మాకు ప్రతీ మ్యాచ్ కీలకమే. గత ఐదు మ్యాచ్‌ల్లో నేను క్రీజులో ఎక్కువ సమయం గడపలేదు.
అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పిచ్‌పై ఎక్కువ సేపు ఆడాలని అనుకున్నాను. తొలి 20 బంతుల్లో నేను పెద్దగా పరుగులు చేయలేదు. కేవలం బంతిని గమనిస్తూ ఆడాను. ఒకసారి పిచ్‌పై కుదురుకున్నాక నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. సరిగ్గా అదే చేశాను. అందుకు చాలా సంతోషంగా ఉంది.

నా షాట్స్ సెలెక్షన్ గురించి నేను ఏమనుకోలేదు. కేవలం పరిస్థితిని బట్టి ఆడాను. నా హెడ్‌ను స్ట్రైట్‌గా ఉంచి, నా బేసిక్స్‌ను అనుసరించాను. నా దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయి. జట్టుకు అవసరమైనప్పుడు వాటిని వాడుతాను. కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నైపుణ్యాన్ని నమ్ముకోవడమే ముఖ్యం. ఈరోజు అదే నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది.
నమన్ ధీర్ సహకారంతోనే..
నమన్ ధీర్‌తో నా భాగస్వామ్యం ఈ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఆ సమయంలో నమన్ చాలా సానుకూల దృక్పథంతో ఆడాడు. ఓవైపు నేను స్లోగా ఆడినా అతను ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ విధానం మాకు చాలా ప్లస్ అయింది. ఈ గెలుపుతో పాటు నా సెంచరీ క్రెడిట్ అతనికే దక్కుతుంది. అతని తర్వాత నేను మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లినందుకు గర్వంగా ఉంది.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications