Tilak Varma: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఎవరికీ సాధ్యంకాని రికార్డులో తెలుగోడు!
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఏ ఆటగాడు సాధించని రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో అంతకంటే లోయరార్డర్‌లో వచ్చి సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన తిలక్ వర్మ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టును ఆదుకోవడంతో పాటు విధ్వంసకర శతకంతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని అందుకున్నాడు.

ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్..
33 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న తిలక్ వర్మ.. మరో 12 బంతుల వ్యవధిలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ 12 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు బాదడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్‌లో నెంబర్ 5 అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఆటగాడు తిలక్ వర్మ మాత్రమే.
అతని కంటే ముందు 2023లో మార్కోస్ స్టోయినీస్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ముంబై ఇండియన్స్‌పై 89 పరుగులు చేశాడు. ఆండ్రీ రస్సెల్(88), రిషభ్ పంత్(88), తిలక్ వర్మ(84) పరుగులు చేశారు. ఓవరాల్‌గా నంబర్ 5 అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా తిలక్ వర్మ నిలిచాడు. గతంలో బెన్ స్టోక్స్(103) 2017లో సెంచరీ బాదగా.. డేవిడ్ మిల్లర్(101) 2013లో, యూసఫ్ పఠాన్(100) 2010లో ఈ ఫీట్ సాధించారు.
ముంబై తరఫున తొలి బ్యాటర్..
ముంబై ఇండియన్స్ తరఫున సెంచరీ బాదిన తొలి నంబర్ 5 బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. గతంలో హార్దిక్ పాండ్యా(91), కీరన్ పోలార్డ్(87) పరుగులు చేశారు. 45 బంతుల్లోనే శతకం బాదిన తిలక్ వర్మ.. ముంబై తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా సనత్ జయసూర్యతో సమంగా నిలిచాడు. అరంగేట్ర ఐపీఎల్‌లో సనత్ జయసూర్య సీఎస్‌కేపై 45 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ముంబై ఇండియన్స్ తరఫున సెంచరీ బాదిన తొలి ఆటగాడి జయసూర్య రికార్డుకెక్కాడు.
ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన బ్యాటర్లలో సనత్ జయసూర్య, తిలక్ వర్మ తర్వాత కామెరూన్ గ్రీన్(47), సూర్యకుమార్ యాదవ్(49), సూర్యకుమార్ యాదవ్(51) ఉన్నారు. రోహిత్ శర్మ, లెండి సిమ్మన్స్ తర్వాత ఇతర మైదానాల్లో సెంచరీ బాదిన మూడో ముంబై ఇండియన్స్ బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్ తరఫున సెంచరీ బాదిన 8వ ప్లేయర్‌గా తిలక్ నిలిచాడు. అతని కంటే ముందు జయసూర్య, సచిన్, రోహిత్, సిమ్మన్స్, గ్రీన్, క్వింటన్ డికాక్‌లు సెంచరీలు సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications