Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిక్కుల్లో సిరాజ్, తిలక్ వర్మ

టీమిండియా స్టార్ క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్‌లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) లీగల్ నోటీసులు పంపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అనుమతిలేని టీజీ టీ20 లీగ్‌కు ప్రచారం కల్పిస్తున్నారనే ఆరోపణలతో ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని టీసీఏ జ‌న‌ర‌ల్ సెక్రటరీ గుర‌వా రెడ్డి మీడియాకు తెలిపారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) క్రికెట్ ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి కూడా నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. 'ఎలాంటి అనుమతులు లేని, చట్ట విరుద్దమైన టీజీ20 లీగ్‌లో భాగమైన నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి వెంకటేష్, అంతర్జాతీయ క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మలతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి టీసీఏ లీగల్ నోటీసులు పంపింది.'అని గురవారెడ్డి మీడియాతో అన్నారు.

వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మను శిక్షించిన బీసీసీఐ

వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మను శిక్షించిన బీసీసీఐ

టీజీటీ20కి అనుమతి లేదు..

బీసీసీఐ అనుమతి లేకుండా టీజీటీ20 లీగ్‌తో హెచ్‌సీఏ కార్పొరేట్ సంస్థలతో కలిసి వ్యాపార లావాదేవీలు నడుపుతోందని టీసీఏ ఆరోపించింది. ఎలాంటి అనుమతి లేని టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడం నేరంతో సమానమని, ఈ లీగ్‌కు ఉన్న చట్టపరమైన గుర్తింపుపై, అలాగే దీనికి సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం వల్ల వచ్చే పరిణామాలపై టీసీఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tilak Varma and Mohammed Siraj Issued Legal Notices Over Association with Controversial League

'టీజీ20 లీగ్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. కాలక్రమేణా దీని పేరును తెలంగాణ ప్రీమియర్ లీగ్ నుంచి టీటీఎల్ (TTL)గా.. ఆ తర్వాత టీజీ20 ప్రీమియర్ లీగ్‌గా.. ఇప్పుడు టీజీ20 గా మార్చింది. కానీ ప్రాథమికంగా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి ఫ్రాంచైజీ ఆధారిత ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడానికైనా అవసరమయ్యే రెండు ముఖ్యమైన నిబంధనలు వారు అనుసరించలేదు.

రూల్స్‌ పాటించలేదు..

బీసీసీఐ గుర్తింపు పొందిన అసోసియేషన్స్ అన్నీ రెండు నియమాలను కచ్చితంగా పాటించాలి. రూల్ నెంబర్ 28 ప్రకారం.. ఈ లీగ్‌ను నిర్వహించే గవర్నింగ్ కౌన్సిల్‌ను అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో ఎన్నుకోవాలి. అలాగే ఈ లీగ్ ఛైర్మన్‌ను కూడా అసోసియేషన్ జనరల్ బాడీనే ఎన్నుకోవడం తప్పనిసరి. కానీ ఇక్కడ అది జరగలేదు'అని గురువా రెడ్డి తెలిపారు.

ఈ టోర్నీతో సెలెబ్రిటీలు తమ సంబంధాలను కొనసాగిస్తే టీసీఏ కోర్టును ఆశ్రయిస్తుందని గురువా రెడ్డి హెచ్చరించారు. 'హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమకున్న చట్టబద్ధత, నిబంధనల లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి సెలబ్రిటీలను వాడుకుంటూ.. భాగస్వామ్యులను తప్పుదోవ పట్టిస్తోంది. అందుకే మేం దీనిని వ్యతిరేకిస్తున్నాం. మేం నోటీసులు పంపాం. వారు గనుక ఈ లీగ్‌తో తమ సంబంధాలను ఇలాగే కొనసాగిస్తే వారిపై లీగల్ కేసులు కూడా ఫైల్ చేస్తాం.' అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ (TCA) తో కలిసి పనిచేయాలని 2021లోనే బీసీసీఐ, హెచ్‌సీఏను ఆదేశించిందని, అయితే ఆ ఆదేశాలను అమలు చేయలేదని గురువా రెడ్డి ఆరోపించారు. అయితే ఈ లీగల్ నోటీసులపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.

IND vs SL: అంపైర్‌తో కెప్టెన్ గొడవ.. మధ్యలో దూరి వైభవ్ ఏం చేశాడో చూస్తే షాకవుతారు!

IND vs SL: అంపైర్‌తో కెప్టెన్ గొడవ.. మధ్యలో దూరి వైభవ్ ఏం చేశాడో చూస్తే షాకవుతారు!
Story first published: Friday, June 19, 2026, 16:37 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+