Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిట్‌నెస్‌లో కోహ్లీనే మించిన ముగ్గురు మొనగాళ్లు..!

 Three players who have beaten Virat Kohlis yo-yo test score
3 Indian Players Who Have Beaten Virat Kohli’s Yo-Yo Score!

ముంబై: భారత జట్టులో ఫిట్‌నెస్ ఫ్రీక్ ఎవరా? అంటే టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ.. అవును ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీ ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసాడు. తాను మాత్రమే ఫిట్‌గా ఉండకుండా.. జట్టు సభ్యులందరూ తనలా ఉండేలా చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ పతాక స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం భారత క్రికెటర్లు ఫిట్‌గా ఉన్నారు.

 ఎంతటీ పెద్ద ఆటగాడైనా..

ఎంతటీ పెద్ద ఆటగాడైనా..

ఈ ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ 2017లో యో-యో టెస్టు‌ను తీసుకొచ్చింది. దీంతో ఆటగాళ్లందరికీ ఫిట్‌నెస్‌పై అవగాహన, శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు కోహ్లీతో పాటు సిక్స్ ఫ్యాక్‌ ఉన్న ఆటగాళ్లు జట్టులో చాలామందే ఉన్నారు.

ఆటగాడు ఎవరైనా గాయపడి లేదా పేలవ ఫామ్‌తో వేటుకి గురై టీమిండియాకి దూరమైతే..? అతను పునరాగమనానికి ముందు ఈ యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌ను అధిగమించాల్సి ఉంటుంది. ఎంతటి పెద్ద ఆటగాడికైనా ఈ పరీక్ష తప్పదు. మూడేళ్ల క్రితం బీసీసీఐ తెచ్చిన ఈ నిబంధన కారణంగా యువరాజ్ సింగ్ పూర్తిగా భారత్ జట్టుకి దూరమవ్వగా.. అంబటి రాయుడు, సురేశ్ రైనా కొన్ని సిరీస్‌లకు దూరం కావాల్సి వచ్చింది.

కోహ్లీ స్కోర్ 19.0..

కోహ్లీ స్కోర్ 19.0..

2017లో ప్రవేశ పెట్టిన ఈ యో-యో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 19.0 స్కోరు సాధించి.. అందర్నీ ఆశ్చర్యపరచడంతో టాప్‌లో నిలిచాడు. కానీ.. కోహ్లీ కంటే ఈ టెస్టులో మెరుగైన స్కోరు సాధించిన క్రీడాకారులు భారత్‌లో ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది.

యో-యో ఫిట్‌నెస్ టెస్టులో విరాట్ కోహ్లీ 19 పాయింట్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పితే.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే కూడా అప్పుడే 19.2 పాయింట్లతో దాన్ని బ్రేక్ చేసినట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. అయినప్పటికీ.. భారత జట్టులో మనీశ్ పాండే‌కు అవకాశాలు దక్కలేదు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌కి చెందిన స్పిన్నర్ మయాంక్ దగర్ తాను ఫిట్‌నెస్ టెస్టులో 19.3 స్కోరు సాధించినట్లు సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించాడు. అతను ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడనున్నాడు.

హాకీ కెప్టెన్ అయితే..

హాకీ కెప్టెన్ అయితే..

ఇక భారత హాకీ టీమ్ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ అయితే.. ఏకంగా 21.4 పాయింట్లు సాధించినట్లు తెలిసింది. ఫిట్‌నెస్ సమస్యలతోనే జట్టులో చోటు కోల్పోయిన సర్దార్.. దాన్ని అందుకునేందుకు తీవ్ర కసరత్తులు చేశాడు. ఇందులో భాగంగా 21.3తో తన పేరిట ఉన్న యోయో రికార్డును తానే అధిగమించాడు.

Story first published: Friday, March 20, 2020, 16:39 [IST]
Other articles published on Mar 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+