Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ఆ ముగ్గురిపై కన్నేసిన ముంబై ఇండియన్స్!

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ సిద్దమవుతుంది. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే వేలానికి ముందే ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేసుకుంది. ట్రేడింగ్ విండో ద్వారా శార్దూల్ ఠాకూర్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ మయాంక్ మార్కండే‌లను తీసుకుంది.

ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకున్న ముంబై 9 మంది ఆటగాళ్లను మాత్రమే వదులుకుంది. ఈ 9 మంది కూడా ముంబై బ్యాకప్ ప్లేయర్లే కావడం గమనార్హం. దాంతో ముంబై పర్స్‌లో రూ.2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బులతోనే జట్టుకు కావాల్సిన ఐదుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో ఒక ఓవర్‌సీస్ స్లాట్ ఖాళీగా ఉంది. ఈ ఐదుగురు ఆటగాళ్లు కూడా బ్యాకప్ ప్లేయర్ కావడంతో ముంబైకి వచ్చే సమస్య ఏం లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో ముంబై ప్రధానంగా ముగ్గురు ప్లేయర్లను టార్గెట్ చేయనుంది.

Three Players Mumbai Indians Could Target in the IPL 2026 Mini Auction

1.అభినవ్ మనోహర్..

ముంబై ఇండియన్స్‌కు ఓ బ్యాకప్ బ్యాటర్ అవసరం ఉంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ఆడగలిగే బ్యాటర్ కావాలి. ఏ ఆటగాడైన గాయపడితే వారి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ముంబై చూస్తోంది. అభినవ్ మనోహర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన అభినవ్ మనోహర్ తీవ్రంగా నిరాశపర్చాడు. కానీ గతంలో అతను గుజరాత్ టైటాన్స్ తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు.

అభినవ్ మనోహర్ చిక్కకపోతే దేశవాళీ క్రికెటర్లను ముంబై కొనుగోలు చేస్తోంది. ఇషాన్ ముల్‌చందానీ, చేతన్ వంటి అప్‌కమింగ్ స్టార్లను కొనుగోలు చేయవచ్చు.

2. లుంగి ఎంగిడి

విదేశీ ప్లేయర్‌ స్లాట్‌ను నింపేందుకు లుంగి ఎంగిడిని కొనుగోలు చేయవచ్చు. అతను బేస్ ధరకు దక్కే ఛాన్స్ ఉంది. అతను ట్రెంట్ బౌల్ట్‌కు మంచి బ్యాకప్ బౌలర్ అవుతాడు. అతను దొరక్కపోతే.. తక్కువ ధరకు లభించే నవీన్-ఉల్-హక్‌ను తీసుకోనుంది. అతను కూడా జట్టుకు మంచి బ్యాకప్ బౌలర్‌గా ఉపయోగపడనున్నాడు.

3. రాహుల్ చాహర్/రవి బిష్ణోయ్..

ముంబై ఇండియన్స్‌కు స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం ఉంది. గత సీజన్‌లో విజ్ఞేష్ పుతుర్ మెరుగైన ప్రదర్శన చేసినా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ ఇండియన్ స్పిన్నర్‌ను తీసుకునేందుకు ముంబై ప్రయత్నించే ఛాన్స్ ఉంది. రవి బిష్ణోయ్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. అతని భారీ ధర పలికే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ చాహర్‌ను ముంబై తీసుకోవచ్చు. అతను మాత్రమే ముంబై బడ్జెట్‌‌కు దొరకవచ్చు. లేదంటే దేశవాళీ స్పిన్నర్లపై ముంబై ఆధారపడాల్సి ఉంటుంది.

ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్ట్

సత్య నారయణ రాజు, రీస్ టాప్లీ, కేఎల్ శ్రీజిత్, కర్ణ్ శర్మ, అర్జున్ టెండూల్కర్(ట్రేడ్ ఔట్), బెవాన్ జేకబ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, లిజాడ్ విలియమ్స్, విఘ్నేష్ పుత్తూర్

ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్

హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్, రాజ్ బవా, రాబిన్ మింజ్, షెర్ఫేన్ రూథర్‌పోర్డ్(ట్రేడ్ ఇన్), శార్దూల్ ఠాకూర్(ట్రేడ్ ఇన్), మయాంక్ మార్కండే(ట్రేడ్ ఇన్)

మిగిలిన పర్స్ విలువ: రూ.2.75 కోట్లు

కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల సంఖ్య:5

Story first published: Thursday, November 20, 2025, 14:33 [IST]
Other articles published on Nov 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+