Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓరీ మీ వేషాలో.. గల్లీ క్రికెట్‌కు సంస్కృతంలో కామెంట్రీ.. నెట్టింట రచ్చ! (వీడియో)

This video of commentary in Sanskrit during gully cricket goes viral

హైదరాబాద్: సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్‌లకు కామెంట్రీ వింటుంటాం. దేశంలో క్రికెట్ ఆదరణ పెరగడంతో ఇప్పుడు స్థానిక భాషలో కూడా వ్యాఖ్యానం లభిస్తోంది. దేశవాళీ, క్లబ్ మ్యాచ్‌లకు కూడా కామెంట్రీ చెబుతున్నారు. అయితే గల్లీ క్రికెట్‌కు కామెంట్రీ చెప్పడం ఎప్పుడైనా విన్నారా? ఇదే పాయింట్‌తో ఓ నెటిజన్ సరదాగా చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే అతని వ్యాఖ్యనం కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడం కాకుండా సంస్కృతంలో ఉండటం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఈ రోజుల్లో సంస్కృతం మాట్లాడే వారి సంఖ్య తక్కువ. దేవుడి పూజల సమయంలోనే ఎక్కువగా సంస్కృత పదాలు వింటుంటాం. మన భాషలోసంస్కృతం కలిసిపోయినా.. ప్రత్యేకంగా సంస్కృతం మాట్లాడేవారు పెద్దగా లేరు.

లక్ష్మీ నారాయణ అనే ట్విటర్ యూజర్.. గల్లీ క్రికెట్ ఆడుతూ సంస్కృతంలో కామెంట్రీ చెప్పాడు. దీన్ని వీడియో తీసి ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ బాలుడు బ్యాటింగ్ చేస్తుండగా.. ఇళ్ల బాల్కానీల నుంచి కొందరు వారి ఆటను వీక్షిస్తున్నారు. ఇదే విషయాన్ని సదరు వ్యక్తి సంస్కృతంలో వివరించాడు. ఆటకు తగ్గట్లు తన ఇంటెన్షన్ తగ్గించకుండా గట్టి వాయిస్‌తో కామెంట్రీ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 3 లక్షలకు పై గా వ్యూస్ సాధించడంతో పాటు 15 వేల లైక్స్ అందుకుంది.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నాు. ఓరీ మీ వేషాలో... గల్లీ క్రికెట్‌కు కామెంట్రీ ఎందిరా? అయ్యా.. మీరు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఐడియా అదిరింది బ్రదర్ అంటూ ఈ వీడియోను రీట్వీట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, October 4, 2022, 14:10 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+