Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli ఆడిన ఈ షాట్.. భూమి మీదున్న ఏ మనిషి ఆడలేడు! (వీడియో)

This Shot From Virat Kohli Has Got A Separate Fan Base (Video)

హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడమే కాదు.. సెంచరీలను మంచినీరు తాగినంత సులువుగా చేస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 శతకాలు బాదిన కోహ్లీ.. ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. మరెన్నో ఘనతలను అందుకున్నాడు.

కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తర్వాత తన ఆట, కెప్టెన్సీతో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా కీర్తించబడ్డాడు. 2016-2018 విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యత్తమమని చెప్పవచ్చు. ఈ రెండేళ్లు విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తన సూపర్ బ్యాటింగ్‌తో భారత సారథిగా ఎంపికయ్యాడు.

బ్యాక్ ఫుట్ పంచ్‌తో...

బ్యాక్ ఫుట్ పంచ్‌తో...

అయితే టీమిండియా వన్డే కెప్టెన్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన మ్యాచ్‌‌లో కోహ్లీ ఆడిన ఓ షాట్.. అతనికి ప్రత్యేక అభిమాన గణాన్ని అందించింది. ఇప్పటికీ ఆ షాట్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో హైలైట్ అని చెప్పవచ్చు. షార్ట్ పిచ్ బాల్‌ను బ్యాక్ ఫుట్ పంచ్‌‌తో ఓవర్ వైడ్ మిడాన్ దిశగా సిక్స్‌గా మలిచిన ఆ షాట్‌కు అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు.

2017లో పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేతో విరాట్ కోహ్లీ పూర్తి స్థాయి వన్డే కెప్టెన్‌గా మారాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లీ(105 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 122).. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ వేసిన స్లోయర్ షార్ట్ పిచ్ బాల్‌ను సిక్స్‌గా మలిచాడు. అయితే ఈ షాట్‌ను చూసిన కామెంటటర్లతో పాటు అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

కోహ్లీకి మాత్రమే సాధ్యం..

కామెంట్రీ ప్యానల్‌లో ఉన్న రవిశాస్త్రి అయితే.. తన వ్యాఖ్యానంతో భారత కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. 'మీ కళ్లను నలుపుకొని మరోసారి ఈ షాట్‌ను చూడండి. ఇది ఫిజిక్స్‌కే వ్యతిరేకంగా ఆడిన షాట్. స్లోయర్ బాల్, షార్ట్ ఆఫ్ లెంగ్త్.. భుజాలను స్వేచ్చగా తిప్పలేని పరిస్థితి.. కానీ కోహ్లీ మాత్రం బంతిని గాల్లోకి తరలించి సిక్స్‌గా మలిచాడు.

కేవలం అతని భుజ బలంతోనే ఈ షాట్ ఆటాడు. విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమైన ఈ షాట్‌ను వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రమే అనుకరించగలరు.'అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా విరాట్ కోహ్లీ ఆడపా దడపా ఈ షాట్స్ ఆడాడు. కానీ మరే ఇతర బ్యాట్స్‌మన్ ఇప్పటి వరకు ఈ షాట్ ఆడలేకపోయారు.

ఈ భూమి మీద ఎవ్వడికి..

ఈ భూమి మీద ఎవ్వడికి..

తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఈ షాట్‌తో కోహ్లీ ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయిందని క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో విరాట్ ఫ్యాన్స్ అంతా అతని సూపర్ షాట్స్‌ను నెమరువేసుకుంటున్నారు.

ఒక్క విరాట్ కోహ్లీ తప్పా మరేవరూ ఈ షాట్ ఆడలేరని, అసలు ఈ భూమి మీదున్న ఏ మనిషికి కూడా ఇది సాధ్యం కాదని కొనియాడుతున్నారు. ఇంకొందరైతే ఆ టైమ్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, ప్రతీ బాల్ మిడిల్ అయ్యేదని గుర్తు చేసుకుంటున్నారు. ఈ షాట్‌తోనే ప్రపంచ క్రికెట్‌లో విరాట్ శకం మొదలైందని కామెంట్ చేస్తున్నారు.

థ్రిల్లింగ్ విక్టరీ..

థ్రిల్లింగ్ విక్టరీ..

ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 350 రన్స్ చేసింది. జాసన్ రాయ్(73), జోరూట్(78), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ విరాట్ కోహ్లీ సెంచరీతో పాటు కేదార్ జాదవ్(76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 120) కూడా సెంచరీతో కదం తొక్కడంతో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించి విజయాన్నందుకుంది. విజయంలో కీలక పాత్ర పోషించిన జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే తొలి విజయం.

Story first published: Wednesday, December 22, 2021, 11:26 [IST]
Other articles published on Dec 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+