హెలీక్యాప్టర్ షాట్‌తో..
28 ఏళ్ల కలను సాకారం చేస్తూ భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ అందించిన ధోనీ.. తొలి టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుపొందాడు. దాంతో మూడు టైటిళ్లు గెలిచిన ఏకైక సారథిగా.. భారత జట్టు అత్యుత్తమ కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఇక 2007-2013 ధోనీ కెరీర్‌లోనే అత్యుత్తమమని చెప్పవచ్చు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ధోనీ సత్తా చాటాడు. అయితే 2013 చాంపియన్స్ ట్రోఫీలో ధోనీ ఆడిన ఓ షాట్.. ప్రపంచవ్యాప్తంగా అతనికి ప్రత్యేక అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఆ షాటే ప్రపంచ క్రికెట్‌లో హైలైట్‌గా నిలిచింది. బౌలర్ వేసిన గుడ్ లెంగ్త్ యార్కర్‌ను ధోనీ తన ట్రేడ్ మార్క్ హెలీకాప్టర్ షాట్‌తో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అయితే ఈ షాట్‌ను చూసిన కామెంటటర్లతో పాటు అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ధోనీకి మాత్రమే సాధ్యం..
ఈ షాట్‌ను చూసి కామెంటేటర్లు తమ వ్యాఖ్యానంతో ధోనీని ఆకాశానికెత్తాడు. 'ఇది నమ్మశక్యం కానీ షాట్. ఇది కేవలం మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే ఆడగలడు. ఈ షాట్‌ను చూసిన తర్వాత బౌలర్ ఖచ్చితంగా అయోమయానికి గురవుతాడు. బౌలింగ్ చేయాలా? వద్దా? అని ఆందోళన చెందుతాడు. ఈ షాట్ చూస్తే ధోనీ మణికట్టు పవరేంటో తెలుస్తోంది. దీన్ని హెలికాప్టర్ షాట్ అంటారు.. ఈ షాట్‌ను మీరేమైనా పిలవండి. కానీ ఇది క్రికెట్‌లో అత్యద్భుతమైన షాట్.'అని కామెంటేటర్ ఈ షాట్‌ను వర్ణించాడు. ఆ తర్వాత ధోనీ చాలా హెలికాప్టర్ షాట్స్ ఆడినా.. ఇతరులు అతన్ని అనుకరించినా.. ఈ షాట్ మీదికి మాత్రం ఏది రాదు.

ఈ భూమి మీద ఎవ్వడికి..
తాజాగా ఓ నెటిజన్ ఈ వీడియోను ట్వీట్ చేస్తూ.. ఈ షాట్‌తో ధోనీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని పేర్కొన్నాడు. ఇలాంటి షాట్స్ ధోనీ ఒక్కడే ఆడగలడని క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో ధోనీ ఫ్యాన్స్ అంతా అతని సూపర్ షాట్స్‌ను నెమరువేసుకుంటున్నారు. ఒక్క ధోనీ తప్పా మరేవరూ ఈ షాట్ ఆడలేరని, అసలు ఈ భూమి మీదున్న ఏ మనిషికి కూడా ఇది సాధ్యం కాదని కొనియాడుతున్నారు. ఇంకొందరైతే ఆ టైమ్‌లో ధోనీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, ప్రతీ బాల్ మిడిల్ అయ్యేదని గుర్తు చేసుకుంటున్నారు. ఈ తరహా బ్యాటింగ్‌తోనే ధోనీ గ్రేట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందాడని కామెంట్ చేస్తున్నారు.

ఆస్ట్రేలియా ఘోరపరాజయం..
ఆస్ట్రేలియాతో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో భారత్ 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఉమేశ్ యాదవ్(5/18), ఇషాంత్ శర్మ(3/11) చెలరేగడంతో ఆసీస్ 65 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 308 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ(77 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) మెరుపులు మెరిపించగా.. దినేశ్ కార్తీ(140 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 146 నాటౌట్) అజేయ శతకం బాదాడు.


Click it and Unblock the Notifications
