Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంఎస్ ధోనీకి 'స్పిరిట్‌ ఆఫ్‌ ద డికేడ్‌'.. అవార్డుకు కారణం ఇదే!!

This is the reason behind MS Dhoni wins ICC Spirit of Cricket Award of the decade

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండు అవార్డులను గెలుచుకున్నాడు. సర్‌ గార్ల్‌ఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద డికేడ్‌ అవార్డును కూడా కోహ్లీ గెలుచుకున్నాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి 'ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్ క్రికెట్‌ అవార్డు' దక్కింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్‌ టెస్టులో ఇయాన్‌ బెల్‌ వివాదాస్పద రనౌట్‌పై మహీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి.. అభిమానులు అతడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఐసీసీ తెలిపింది. అయితే కోహ్లీకి వచ్చిన రెండు అవార్డులు ఒకటైతే.. ధోనీకి దక్కిన అవార్డు మరొకఎత్తు. ఇంతకు ధోనీకి దశాబ్దపు స్పిరిట్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ అవార్డు ఎందుకు దక్కింది అనే విషయాన్ని పరిశీలిస్తే...

రెండో ఇన్నింగ్స్‌లో వివాదం:

రెండో ఇన్నింగ్స్‌లో వివాదం:

2011లో టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. తొలి టెస్టులో 196 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం నాటింగ్‌హామ్‌ టెస్టుకు సన్నద్ధమైంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 221 పరుగులు చేయగా.. భారత్ 288 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. 544 పరుగులు చేసి భారత్‌కు 478 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓ వివాదం నెలకొంది.

 టీ విరామానికి ముందు:

టీ విరామానికి ముందు:

మూడో రోజు ఆటలో పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఇయాన్‌ బెల్ షాట్ ఆడాడు. డీప్ ‌స్క్వేర్‌లెగ్‌లో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ అద్భుత డైవ్‌తో బంతిని అడ్డుకున్నాడు. అయితే అది ఫోరా? కాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ లోపు బెల్, ఇయాన్ మోర్గాన్.. మూడు పరుగులు పూర్తి చేశారు. టీ విరామానికి ముందు అదే ఆఖరి బంతి కావడంతో క్రీజులోకి వెళ్లకుండా అటునుంచే మైదానాన్ని వీడటానికి బయలుదేరారు. బంతిని అందుకున్న ఎంఎస్ ధోనీ తెలివిగా స్టంప్స్‌ వద్ద ఉన్నఅభినవ్ ముకుంద్‌కు బంతి విసరడంతో అతను వికెట్లను గిరటేశాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో అయోమయం చోటుచేసుకుంది. అంపైర్లకు కఠిన సవాల్ ఎదురైంది.

 అపీల్‌ను వెనక్కి తీసుకోవాలని:

అపీల్‌ను వెనక్కి తీసుకోవాలని:

థర్డ్‌ అంపైర్‌ దాన్ని పరిశీలించి బంతి బౌండరీకి వెళ్లలేదని, నిబంధనల ప్రకారం ఇయాన్ బెల్‌ రనౌట్‌గా ప్రకటించాడు. ఆ నిర్ణయానికి బెల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. స్టేడియంలోని వీక్షకులంతా 'ఛీట్‌.. ఛీట్'‌ అంటూ నినాదాలు చేశారు. అయితే టీ విరామంలో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌, కోచ్‌ యాండీ ఫ్లవర్‌ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ వద్దకు వెళ్లి రనౌట్‌ అపీల్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. ధోనీ క్రీడాస్ఫూర్తితో దాన్ని వెనక్కి తీసుకోవడంతో బెల్ తిరిగి క్రీజులోకి వచ్చాడు.

మరో 22 పరుగులు చేసి:

అయితే విరామంలో ఎంఎస్ ధోనీతో జరిగిన చర్చలేవీ ప్రేక్షకులకు తెలియదు. ఆఖరి సెషన్‌కు అంపైర్లతో పాటు ఇయాన్ బెల్‌ కూడా క్రీజులోకి రావడంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. మైదానంలోకి టీమిండియా వచ్చినప్పుడు కరతాళ ధ్వనులతో అభినందించారు. ఇంగ్లాండ్ జట్టు కూడా తమ డ్రెస్సింగ్ రూమ్‌లో నిల్చొని మహీ నిర్ణయాన్ని గౌరవించింది. ఆ మ్యాచులో బెల్‌ మరో 22 పరుగులు చేసి 159 స్కోరు వద్ద ఔటయ్యాడు. భారత్ పరాజయాన్ని చవిచూసినప్పటికీ ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానులకు జ్ఞాపకంగా నిలిచిపోయింది. అప్పట్లోనే మహీ ఐసీసీ స్పిరిట్ క్రికెట్ ఆఫ్ ద అవార్డు కూడా గెలుచుకున్నాడు.

ISL 2020 21: బెంగళూరు vs జంషెడ్‌పూర్ ప్రివ్యూ.. జట్లు ఇవే!!

Story first published: Monday, December 28, 2020, 20:12 [IST]
Other articles published on Dec 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+