Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ISL 2020 21: బెంగళూరు vs జంషెడ్‌పూర్ ప్రివ్యూ.. జట్లు ఇవే!!

ISL 2020-21: Bengaluru FC vs Jamshedpur FC Dream11 Prediction

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ 2020-21 సీజన్‌లో భాగంగా ఈరోజు రాత్రి బెంగళూరు ఎఫ్‌సీ, జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గోవాలోని ఫటోర్డాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈ మ్యాచులో స్టార్ ఆటగాళ్లతో నిండిన బెంగళూరు ఎఫ్‌సీ ఫెవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది.

బెంగళూరు ఎఫ్‌సీ ఆడిన ఏడు మ్యాచులలో మూడు విజయాలతో 12 పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో ఉంది. బెంగళూరు ఒక మ్యాచులో ఓడి.. మూడు డ్రా చేసుకుంది. మరోవైపు జంషెడ్‌పూర్ ఆడిన ఎనమిది మ్యాచులలో రెండు విజయాలు, నాలుగు డ్రాలతో 10 పాయింట్లను ఖాతాలో వేసుకుని ఆరో స్థానంలో ఉంది. ముంబై సిటీ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఏటీకే మోహన్ బగాన్ అదే 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెంగళూరు ఎఫ్‌సీ (12), నార్త్ ఈస్ట్ యునైటెడ్ (11), ఎఫ్‌సీ గోవా (11) టాప్-5లో ఉన్నాయి.

జట్లు:
బెంగళూరు ఎఫ్‌సీ: గుర్ప్రీత్ సింగ్ సంధు, రాహుల్ భేకే, ప్రతీక్ చౌదరి, జువానన్, హర్మన్‌జోట్ ఖబ్రా, ఎరిక్ పార్తాలు, డిమాస్ డెల్గాడో, క్లెయిటన్ సిల్వా, సునీల్ ఛెత్రి, ఉదాంత సింగ్, దేశోర్న్ బ్రౌన్.

జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ: టీపీ రెహేనేష్, రికీ లల్లవ్‌మావ్మా, లాల్డిన్లియానా రెంత్లీ, పీటర్ హార్ట్లీ, స్టీఫెన్ ఈజ్, ఐజాక్ వాన్మల్సావ్మా, జాకిచంద్ సింగ్, అలెగ్జాండర్ లిమా, ఐటర్ మన్రాయ్, నెరిజస్ వాల్స్కిస్, అనికేట్ జాదవ్.

Story first published: Monday, December 28, 2020, 19:15 [IST]
Other articles published on Dec 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+