Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విషెస్ చెప్పడం ఆలస్యమైంది: ధోనికి తన స్టయిల్లో గిల్‌క్రిస్ట్

హైదరాబాద్: మొహాలిలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో అరుదైన మైలురాయికి చేరుకున్న ధోనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా తనదైన శైలిలో ధోనీకి శుభాకాంక్షలు తెలిపాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకపై విన్నింగ్ షాట్‌గా సిక్సర్ కొట్టిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచుతూ ధోనికి శుభాకాంక్షలు తెలిపాడు.

మూడో వన్డేలో సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన ధోని విశేషం ఏమిటంటే ఆ ఫోటోలో ధోని క్రీజులో బ్యాట్‌తో బంతిని కొడుతుంటే వెనుకన శ్రీలంక కీపర్ కుమార సంగక్కర కూడా ఉన్నాడు. ఒకరోజు లేదా శుభాకాంక్షలు చెప్పడం ఆలస్యమైంది కానీ.. 9 వేల పరుగుల మైలురాయి చేరుకున్నందుకు ధోనికి హ్యూజ్ కంగ్రాట్స్ అంటూ గిల్‌క్రిస్ట్ విషెస్ చెప్పాడు.

అన్ని వేళలా ధోని కూల్, కామ్‌గా ఉంటాడనేందుకు నిదర్శనంగా ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే కీపర్లలో ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్, శ్రీలంక ఆటగాడు సంగక్కర మాత్రమే 9వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు.

Adam Gilchrist

ఈ మ్యాచ్‌లో ధోని అనేక రికార్డులను సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సట్నర్ వేసిన 17వ ఓవర్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచి ధోని ఈ ఘనతను సాధించాడు. దీంతో 9వేల పరుగులను చేరుకున్న 5వ భారత ఆటగాడిగా నిలిచాడు.

9000: ధోని ఖాతాలో మరో రికార్డు, 5వ ఆటగాడిగా గుర్తింపు 35 ఏళ్ల ధోని భారత్ తరుపున 280 వన్డేలాడి 8,978 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మూడో వన్డేలో ధోని 9000 పరుగుల మైలురాయిని అందుకుని ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఎలైట్ గ్రూపులో ధోని చేరాడు.

సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, అజారుద్దీన్ తర్వాత 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా చూస్తే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న 17వ బ్యాట్స్ ‌మెన్.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+