సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం:
విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న ఆటగాళ్లకు కేరళ సంప్రదాయక వాయిద్యాలతో కొంతమంది కళాకారులు చేసిన ప్రదర్శన అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పంచుకుంది.
ధోనీని ఎంపిక చేయకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు: గంగూలీ
మా దేశం గుర్తుకు వస్తుందంటూ
ఇంతటి ఘనస్వాగతం పలికిన అభిమానులకు ప్రత్యేక ధనవాద్యాలంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ జట్టు కూడా తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పంచుకుంది. కేరళను చూస్తుంటే మా దేశం గుర్తుకు వస్తుందంటూ వీడియో కింద రాసుకొచ్చింది.
2017లో తొలి అంతర్జాతీయ మ్యాచ్
2015లో ప్రారంభమైన ఈ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఇప్పటివరకూ కేవలం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే జరిగింది. భారత్, న్యూజిలాండ్ మధ్య 2017 నవంబర్ 1న ఒక టీ20 మ్యాచ్ జరిగింది.
50వ వేదికగా గ్రీన్‌ఫీల్డ్ మైదానం
ఆ తర్వాత నుంచి ఇక్కడ ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం మళ్లీ ఇన్నాళ్లకు కుదిరింది. భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇస్తున్న 50వ వేదిక కూడా ఇదే గ్రీన్‌ఫీల్డ్ మైదానం కావడం విశేషం.


Click it and Unblock the Notifications
