For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని జట్టు నుంచి అందుకే తప్పించారు: గంగూలీ

India Vs West Indies 2018, 4th ODI : Isn’t Surprised By MS Dhoni’s Axing From T20Is Says Ganguly
 MS Dhoni being dropped from Indias T20I squad hasnt surprised Sourav Ganguly. Heres why

హైదరాబాద్: ఇటీవల వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో ధోనీ ఎంపిక కాలేదు. అయితే ఈ విషయం పట్ల తానేమీ ఆశ్చర్యానికి గురి కావడం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ రెండు టీ20 సిరీస్‌ల కోసం సెలక్టర్లు.. ధోనీని తప్పించి అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌కి అవకాశమిచ్చారు. ఈ క్రమంలో ధోనీ టీ20 కెరీర్‌ ముగిసినట్లేనని పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి.

కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన

కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన

అయితే ధోనీపై వేటు గురించి గంగూలీ మాట్లాడుతూ.. కొంతకాలంగా అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆ కారణం చేతనే సెలక్షన్‌ కమిటీ అతనిపై వేటు వేసి, రిషబ్‌ పంత్‌కు అవకాశం కల్పించారు. వారి నిర్ణయం నాకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. అదేవిధంగా 2020లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అతను ఆడటం అనుమానమే.' అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ముంబైలో సెంచరీ: రాయుడికి వరల్డ్ కప్ బెర్తు ఖాయమేనా?

2014లో టెస్టులకి రిటైర్మెంట్

2014లో టెస్టులకి రిటైర్మెంట్

ధోనీ 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించినా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్న ధోనీకి.. గురువారం ఐదో వన్డేనే ఈ ఏడాదిలో ఆఖరి మ్యాచ్. దీని తర్వాత వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనే మళ్లీ అతను మైదానంలోకి దిగనున్నాడు.

 వన్డేల్లో ధోనీ ఎలా ఆడతాడని

వన్డేల్లో ధోనీ ఎలా ఆడతాడని

మరోవైపు ఇప్పట్లో దేశవాళీ క్రికెట్‌లోనూ ఎలాంటి రంజీ మ్యాచ్‌లు లేవు. ఈ క్రమంలో కనీసం ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా లేకుండా ఆసీస్‌తో వన్డేల్లో ధోనీ ఎలా ఆడతాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ నాటికి అతను ఏవిధంగా సన్నద్ధమవుతాడని అంటున్నారు.

టీ20లలో మళ్లీ ధోనీ కొనసాగుతాడు:

టీ20లలో మళ్లీ ధోనీ కొనసాగుతాడు:

ఇదే విషయంపై ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ధోనీని వెస్టిండీస్‌తో టీ20సిరీస్‌కు ఎంపిక చేయలేదని అతను టీ20లలో ఆడడని లేదు. ఆరు టీ20 మ్యాచ్ లలో ఆడలేనని తెలపడం వల్లనే అతనిని తీసుకోలేదు. ఈ సిరీస్ తర్వాత మళ్లీ అతను షార్ట్ ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు.

Story first published: Wednesday, October 31, 2018, 9:42 [IST]
Other articles published on Oct 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+