Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: హోటల్ రోడ్లన్నీ బ్లాక్ చేశారు..ఇలాంటి సపోర్ట్ నేనెక్కడా చూడలేదు: పాట్ కమిన్స్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలవడం కష్టమైన విషయమేనని అంగీకరించాడు. మంచి విజయంతో లీగ్ దశను ముగించాలనుకుంటున్నామని ఆకాంక్షించాడు. హైదరాబాద్ అభిమానుల ప్రేమ అద్భుతమని కొనియాడాడు.

టాప్-2 కష్టమే..

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2 ప్లేస్‌కు చేరుకోవడం అనేది ఇప్పుడు కొంచెం కష్టమైన విషయమే. కానీ మా వంతు గట్టిగా ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్‌ను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాం. మా బలాన్ని పరీక్షించుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్‌కు వెళ్లేముందు మేం కొన్ని కొత్త విషయాలను ప్రయత్నించి చూడాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం.

ఆఖరి మ్యాచ్‌కు ముందే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సీజన్‌లో మా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మా అభిమానులు మద్దతు అద్భుతం. గత కొన్ని రోజులుగా మా హోటల్ చుట్టుపక్కల రోడ్లన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన ప్రతీ నైట్ మ్యాచ్‌లో మేం గెలిచాం. ఈ రోజు కూడా మంచి విజయంతో లీగ్ దశను ముగిస్తామని ఆశిస్తున్నాను. గత మ్యాచ్‌లో ఆడిన కాంబినేషన్‌తోనే ఈ రోజు కూడా బరిలోకి దిగుతున్నాం.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

They ve Been Amazing Pat Cummins Hails Passionate Uppal Crowd During SRH vs RCB Clash in IPL 2026
Photo Credit: screen grab for JioHotstar

అందుకే బెతెల్‌‌ను పక్కనపెట్టాం..

మరోవైపు తాము ఎక్కడికి వెళ్లినా తమ అభిమానుల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందని, దాంతో ప్రతీ మైదానం తమకు హోమ్ గ్రౌండ్‌లాగే అనిపిస్తుందని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తుది జట్టులో ఒక మార్పు చేయాల్సి వచ్చిందని, చేతి వేలి గాయంతో జాకోబ్ బెతెల్ ఆడటం లేదన్నాడు.

'మేం ఎక్కడికి వెళ్లినా సరే.. అది మాకు సొంత మైదానం లాగే అనిపిస్తుంది. ఇది మాకు నామమాత్రపు మ్యాచ్ అయినా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేస్తాం. పాయింట్స్ టేబుల్‌లో ఏ స్థానంలో ఉన్నా.. మైదానంలోకి దిగాక ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రమాణాలతో ఆడాల్సిందే. ఈ సీజన్‌లో మేం మూడు విభాగాల్లో రాణించాం. ఐపీఎల్ వంటి టోర్నీల్లో విజేతగా నిలవాలంటే మూడు విభాగాల్లో రాణించాల్సిందే. ఈ సీజన్‌లో మమ్మల్ని గాయాల బెడద వేధించలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఒక మార్పు ఉంది. జాకోబ్ బెతెల్ చేతి వేలి గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో నేను బరిలోకి దిగుతున్నాను.'అని రజత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 22, 2026, 19:30 [IST]
Other articles published on May 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+