Samit Dravid: తండ్రికి తగ్గ తనయుడు.. సత్తా చాటిన ద్రవిడ్ కొడుకు!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 క్రికెట్ టోర్నీలో అసాధారణ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్‌కు ఫిదా అయిన అభిమానులు 'జూనియర్ వాల్'అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ టోర్నీలో కళ్యాని బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. హుబ్లీ టైగర్స్‌తో గత బుధవారం జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేసి తమ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సమిత్ ద్రవిడ్ దూకుడుగా ఆడి జట్టుకు 203 పరుగుల భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత హుబ్లీ టైగర్స్ 201 పరుగులే చేయడంతో కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్ టీమ్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
{image-samit-dravid-1-44381783072254jpeg telugu.mykhel.com}
అయితే సమిత్ ద్రవిడ్ బ్యాటింగ్ చేసిన విధానం విమర్శకులను ఆకట్టుకుంది. అచ్చం ద్రవిడ్ తరహాలోనే బ్యాటింగ్ చేస్తుండటం చూసి నెటిజన్లు జూనియర్ వాల్ అని కామెంట్ చేస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ తనయుడిగా సమిత్ ద్రవిడ్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. అతను వ్యక్తిగత ప్రదర్శనతోనే ఆకట్టుకుంటున్నాడు.
కర్ణాటక జూనియర్ క్రికెట్‌తో పాటు మహారాజా సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన సమిత్ ద్రవిడ్.. 28 సగటు, 138.27 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. ఇందులో టాప్ స్కోర్ 39 కావడం విశేషం. ఈ తరం క్రికెట్‌కు తగ్గట్లు దూకుడుగా ఆడుతూనే ప్రశాంతంగా ఉండే సమిత్ ద్రవిడ్ ఆట.. భవిష్యత్తులో ఐపీఎల్‌లో, భారత జట్టులో అతనికి ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

