Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కమిన్స్, ఇషాన్ కాదు.. అతని వల్లే SRH గెలిచింది

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. సోమవారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఆరెంజ్ ఆర్మీతో పాటు గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అయ్యింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల‌కు 180 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో పాట్ కమిన్స్ మూడు వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసిస్తే.. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. కమిన్స్, ఇషాన్ కిషన్ మెరుగైన ప్రదర్శనతోనే ఆరెంజ్ ఆర్మీ గెలిచిందని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

The Unsung Hero Why Heinrich Klaasen Deserves Equal Credit for SRH s Playoff-Sealing Win Over CSK

కానీ ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి ప్రధాన కారణం హెన్రీచ్ క్లాసెన్. మిడిల్ ఓవర్లలో క్లాసెన్(26 బంతుల్లో 6 ఫోర్లతో 47) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. లక్ష్యఛేదనలో 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన క్లాసెన్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ పార్ట్‌నర్‌షిప్ తమని గెలిపించిందని మ్యాచ్ అనంతరం పాట్ కమిన్స్ కూడా తెలిపాడు.

బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న వికెట్‌పై క్లాసెన్ దూకుడుగా ఆడటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చింది. లేదంటే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిపాలయ్యేది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన క్లాసెన్ స్లో పిచ్‌పై కూడా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లకుండా దూకుడుగానే ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 'నేను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులు బ్లాక్ చేశాక.. ఇలా ఆడలేననిపించింది. ఈ పిచ్‌పై నేను దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నా, అది ఈ రాత్రి వర్కవుట్ అయింది. నా బ్యాటింగ్‌ తీరు పట్ల సంతోషంగా ఉన్నాను.

ఈ సీజన్‌ అంతా మా బ్యాటర్లు ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటున్నారు. ఒకరు వేగంగా ఆడుతున్నప్పుడు, మరొకరు తమ అహాన్ని పక్కనబెట్టి స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్‌బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. ఈ చెన్నై వికెట్ కొద్దిగా నెమ్మదిగా ఉంటూ, బంతి తక్కువ ఎత్తులో వచ్చింది. ఇక్కడ ఆడటం అంత సులువు కాదు.'అని క్లాసెన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, May 19, 2026, 13:55 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+