For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరగని మ్యాచ్.. 7 పరుగులకే ఆలౌట్.. 8 బంతుల్లోనే విజయం!

The shortest match in the world of cricket, the team all out for just 7 runs

లండన్‌: క్రికెట్ చరిత్రలోనే కనివిని ఎరగని మ్యాచ్ యార్క్‌షైర్‌ ప్రీమియర్‌ టీ10 లీగ్‌లో చోటు చేసుకుంది. లీగ్‌లో భాగంగా ఈస్ట్‌రింగ్‌స్టన్ క్లబ్, హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. ఈ 7 పరుగుల్లో 3 ఎక్స్‌ట్రాలుగా వచ్చినవే. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిల్లమ్‌ మాన్క్‌ ఫ్రైస్టన్‌ జట్టు బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ జట్టులో 8 మంది డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మిగిలిన ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్‌ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌రింగ్‌స్టన్‌ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించి సునాయస విజయాన్నందుకుంది. ఈస్ట్‌రింగ్‌స్టన్‌ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా లభించింది. ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్‌ చరిత్రకెక్కింది.

Story first published: Sunday, July 11, 2021, 19:55 [IST]
Other articles published on Jul 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+