Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం సంజూ.. కోహ్లీని తప్పించేవారా?

యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్, యూనివర్స‌ల్‌ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల నిరీక్షణ తర్వాత బరిలోకి దిగాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్న భారత ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

వైభవ్ సూర్యవంశీ‌తో డ్రింక్స్ మోయించండి.. గంభీర్‌కు అండగా అశ్విన్!

వైభవ్ సూర్యవంశీ‌తో డ్రింక్స్ మోయించండి.. గంభీర్‌కు అండగా అశ్విన్!

అయితే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం సంతోషాన్నిచ్చినా.. అతని కోసం సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగి టీమిండియా విశ్వవిజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించాడు. నిస్వార్థమైన బ్యాటింగ్‌తో జట్టు కోసం ఆడి మూడు శతకాలను చేజార్చుకున్నాడు. ప్రపంచకప్‌లో సంజూ.. 5 ఇన్నింగ్స్‌ల్లో 80.25 సగటు, 199.38 స్ట్రైక్‌రేట్‌తో 321 పరుగులు చేశాడు.

The Sanju Samson Selection Row Fans Question If Rohit Sharma or Virat Kohli Would Face Similar Treatment

ప్రపంచకప్ అందించిన ఆటగాడు కావడంతోనే గత మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. అయితే సంజూ శాంసన్ స్థానంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మనో ఉండి ఉంటే వైభవ్ సూర్యవంశీ కోసం తప్పించేవారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైభవ్ కోసం సంజూ శాంసన్‌నే ఎందుకు పక్కన పెట్టారు? అనే వాదన కూడా వినిపిస్తోంది. సంజూ శాంసన్ తరహాలోనే ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు కూడా విఫలమయ్యారని పలువురు మాజీ క్రికెటర్లు ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా సంజూ శాంసన్‌కు ఇంకొన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని, అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సబా కరీం, దినేశ్ కార్తీక్ బహిరంగంగానే సంజూ శాంసన్‌కు అండగా నిలిచారు.

IND vs ENG 2nd T20I: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సంజూపై వేటు!

IND vs ENG 2nd T20I: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సంజూపై వేటు!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ కూడా సంజూ శాంసన్‌తో ప్రత్యేకంగా మాట్లాడటం టీవీ కెమెరాల్లో కనిపించింది. అతనికి కూడా ఈ నిర్ణయం నచ్చలేదని తెలుస్తోంది. కానీ బయటి నుంచి వచ్చిన ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థం అవుతుంది. సంజూ శాంసన్ స్థానంలో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ(14) తీవ్రంగా నిరాశపర్చాడు. 10 బంతుల్లో 2 సిక్స్‌లు మాత్రమే బాది స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Saturday, July 4, 2026, 21:30 [IST]
Other articles published on Jul 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+