For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, రోహిత్, హార్దిక్ బయోపిక్స్‌కు సూటయ్యే తెలుగు హీరోలు ఎవరంటే!

భారత్‌లో సినిమా, క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా, క్రికెట్ పిచ్చి ఉన్నోడు చదువుల్లో అస్సలు రాణించలేడనే ఓ జోక్ కూడా ఉంది. అంతలా జనాలపై సినిమా, క్రికెట్ ప్రభావం ఉంది. ఈ రెండు కలిస్తే ఆ పిచ్చి మరింత పీక్‌కు చేరుతోంది.

ఆ ప్రయత్నంలో భాగంగానే స్టార్ క్రికెటర్ల జీవిత కథల ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ చిత్రాలు బాక్సాఫీసు షేక్ చేశాయి. ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ, సచిన్, కపిల్ దేవ్ బయోపిక్స్ ప్రేక్షకాదరణను పొందాయి. క్రికెట్ కథాంశంతో వచ్చిన సినిమాలు కూడా బాగా హిట్టయ్యాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ఆటగాళ్ల బయోపిక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ హీరోలకు దగ్గర పోలీకలతో ఉన్న నటులపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

The Perfect Cast Actors for Kohli Rohit and Hardik Biopics

రోహిత్‌లానే.. శర్వానంద్, శివ

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్‌కు తెలుగు హీరో శర్వానంద్, తమిళ హీరో శివ సరిగ్గా సరిపోతారు. ఈ ఇద్దరూ అచ్చం రోహిత్ శర్మలానే ఉంటారు. రోహిత్ జీవితం కూడా సినిమా తరహాలోనే ఉంటుంది. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కెప్టెన్‌గా ఎదిగిన తీరు.. సతీమణి రితికా సజ్దేతో లవ్ ఎఫైర్, జట్టులో విరాట్ కోహ్లీతో నెలకొన్న విభేదాలు అన్నీ సినిమాకు కావాల్సిన అంశాలే.

కోహ్లీలా కావిట్ సెటిన్ గునెర్

విరాట్ కోహ్లీ కూడా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌గా ఎదిగాడు. అతని జీవితంలో కూడా సినిమాను తలపించే డ్రామా ఉంది. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమ, పెళ్లితో పాటు కెరీర్ ప్రారంభంలో ఆటగాళ్లతో గొడవలు, జట్టులో విభేదాలు, అనూహ్యంగా టెస్ట్ రిటైర్మెంట్ వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కోహ్లీ బయోపిక్‌కు తెలుగు హీరో రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ కపూర్‌తో పాటు హాలీవుడు యాక్టర్ కావిట్ సెటిన్ గునెర్ సరిగ్గా సరిపోతారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా.. అచ్చం ధనుష్‌‌లానే

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జీవితం కూడా క్రీడా స్ఫూర్తి దాయకం. అత్యంత నిరూపేద కుటుంబం నుంచి వచ్చిన పాండ్యా.. మ్యాగీలతోనే కడుపు నింపుకున్న సందర్భాలు ఉన్నాయి. నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమాయణం, విడాకులు, గాయాలతో సతమతమవ్వడం, రీఎంట్రీ ఇవ్వడం సినిమాకు కావాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. హార్దిక్ బయోపిక్‌కు తమిళ హీరో ధనుష్ సరిగ్గా సరిపోతాడు. ఈ ఇద్దరు ఒకేలా ఉంటారు.

Story first published: Wednesday, August 27, 2025, 21:41 [IST]
Other articles published on Aug 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+