Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌తో వన్డే సిరీస్.. విరాట్ కోహ్లీ ఆసక్తికర ట్వీట్!

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు జట్టులో కొనసాగుతానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. 'పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో..అప్పుడే ఓడిపోయినట్టు'అనే కొటేషన్‌ను కోహ్లీ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 వరకు కోహ్లీ ఆటలో కొనసాగుతాడని, ఈ ట్వీట్ అర్థం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. మరికొంరు మాత్రం గ్రేటెస్ట్ ఫార్మాట్‌ను ఎందుకు వదిలేసావని ప్రశ్నిస్తున్నారు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా గురువారమే ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఈ సిరీస్‌తోనే కోహ్లీ, రోహిత్ టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ.. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు.

The Only Time You Truly Fail Virat Kohli s Cryptic Post Ignites ODI Future Speculation

వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయం కోహ్లీ, రోహిత్‌లు జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి. కాలమే నిర్ణయిస్తుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బదులిచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రాణిస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా సిరీస్ వారి కెరీర్‌కు ఓ దిశానిర్దేశం కానుంది. ఈ మూడు వన్డే మ్యాచ్‌ల్లో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత వన్డే జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ.

వన్డే షెడ్యూల్..

తొలి వన్డే: అక్టోబర్ 19(ఆదివారం),పెర్త్, ఉదయం 9 గంటలకు
రెండో వన్డే: అక్టోబర్ 23(గురువారం), అడిలైడ్, ఉదయం 9 గంటలకు
మూడో వన్డే: అక్టోబర్ 25(శనివారం), సిడ్నీ , ఉదయం 9 గంటలకు

Story first published: Thursday, October 16, 2025, 11:59 [IST]
Other articles published on Oct 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+