For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నీకు అబ్బాయిలు ఇష్టమా.. ఆ వివాదం మరచిపోవాలనుకుంటున్నా'

Just want to forget that: Shannon Gabriel on altercation with Joe Root

సౌతాంప్టన్‌: నీకు అబ్బాయిలు ఇష్టమా? అన్న వివాదం ముగిసింది, దాన్ని మరచిపోవాలనుకుంటున్నా అని వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెనాల్‌ గాబ్రియెల్‌ తెలిపాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌కు సంబంధించి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేవని‌ పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లండ్‌తో సెయింట్‌ లూసియాలో జరిగిన మూడో టెస్టులో కెప్టెన్ జో రూట్‌ను స్లెడ్జ్‌ చేసిన గాబ్రియెల్..‌ నాలుగు మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు.

'గే'గా ఉండటంలో తప్పులేదు:

'గే'గా ఉండటంలో తప్పులేదు:

సెయింట్‌ లూసియాలో జరిగిన టెస్టులో 'నీకు అబ్బాయిలు ఇష్టమా?' అంటూ జో రూట్‌ను షెనాల్‌ గాబ్రియెల్‌ కామెంట్‌ చేశాడు. దీనిపై అప్పట్లో రూట్‌ కూడా గాబ్రియెల్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. '"గే"గా ఉండటంలో తప్పులేదు. మీ దేశంలో "గే సెక్స్"‌ నేరం కావొచ్చు' అని రూట్‌ ధీటుగా బదులిచ్చాడు. ఆపై గాబ్రియెల్‌పై నిషేధం పడింది. ఇక ఇంగ్లీష్ పర్యటన కోసం విండీస్ జట్టు తాజాగా అక్కడికి చేరుకొని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. అయితే తాజాగా గాబ్రియెల్‌ ప్రెస్ కాన‍్ఫరెన్స్‌లో పాల్గొనగా.. అప్పటి వివాదంపై ఇంగ్లీష్ రిపోర్టర్లు ప్రశ్నలు సంధించారు.

ఆ వివాదంను మరచిపోవాలనుకుంటున్నా:

ఆ వివాదంను మరచిపోవాలనుకుంటున్నా:

షెనాల్‌ గాబ్రియెల్‌ మాట్లాడుతూ... 'అది ముగిసిన వివాదం. ఇప్పుడు దానిని పెద్దదిగా చూడటం లేదు. ఆ వివాదంను మరచిపోవాలనుకుంటున్నా. మరొకసారి ఆ తరహా కామెంట్లు చేసే ఉద్దేశం లేదు. అది వ్యక్తిగత పరిహాసం. మీరు ఆట యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉన్నంత వరకూ కొంచె వ్యక్తిగత పరిహాసం కూడా ఉంటుంది. అప్పుడు చేసిన వ్యాఖ్యలు అగౌరవపరిచేందుకు చేసినవి కావు. ఆటలో కాస్త పరిహాసం కూడా ఉంటుంది. ఈ విషయంలో పెద్దగా మార్పు వస్తుందని అనుకోను' అని అన్నాడు.

రూట్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు:

రూట్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు:

'నాకు జో రూట్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు. ఇంగ్లండ్‌ జట్టు మొత్తం టార్గెట్‌. తుది జట్టులో నాకు ఆడే అవకాశం వస్తే.. రూట్‌, బెన్ స్టోక్స్‌ ఇలా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకోకూడదు. నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది. నా పూర్తిస్థాయి ప్రదర్శనతో వారిని కట్టడి చేస్తా. వంద శాతం ప్రదర్శన చేయకపోతే ఎవరినైనా కట్టడి చేయడం కష్టమే. గతేడాది కరీబియన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ప్రణాళికలే ఇక్కడ కూడా ఉంటాయి. అందులో పెద్దగా మార్పులు ఉంటాయని అనుకోవడం లేదు' అని గాబ్రియెల్‌ చెప్పాడు.

 సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు:

సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు:

గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా జూలై 8వ తేదీ నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య సౌతాంప్టాన్‌లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ జరుగనుంది. కరోనా మహమ్మారి కారణంగా క్రీడాలోకం మూడు నెలలుగా స్తంభించిపోగా.. ఈ టెస్ట్ ద్వారా క్రికెట్ ఆట మొదలుకానుంది.

తొలి బంతికే వికెట్.. విజ‌య్ శంక‌ర్ ఏమన్నాడంటే?

Story first published: Friday, June 19, 2020, 13:01 [IST]
Other articles published on Jun 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+