For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తాకరాని చోట తాకిన బంతి.. నొప్పితో గిల గిల కొట్టుకున్న SRH మాజీ బ్యాట్స్‌మన్ (వీడియో)

The Hundred: Alex Hales gets hit in the groin twice while facing Reece Topley

హైదరాబాద్: క్రికెట్‌లో సరికొత్తగా పురుడుపోసుకున్న 'ది హండ్రెడ్ లీగ్' ఫార్మాట్ ఇంగ్లండ్ వేదికగా రసవత్తరంగా సాగుతోంది. కొత్త నిబంధనలతో అభిమానులకు కావాల్సిన మజాను అందిస్తోంది. అయితే ఈ లీగ్‌లో భాగంగా ఆదివారం ఓవల్ ఇన్విన్సిబుల్స్, ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ట్రెంట్ రాకెట్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ విచిత్రకరమైన పరిస్థితిని ఎదురైంది.

బౌలర్ వేసిన బంతి వరుసగా అతని రహాస్య ప్రదేశంలో రెండు సార్లు బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో క్రీజులో దొర్లాడు. కింద మీద పడుతూ యోగసనాలు వేశాడు. ఈ అనూహ్య ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. ఓవైపు అలెక్స్ హేల్స్ నొప్పితో విలవిలలాడుతుంటే.. మరోవైపు గ్యాలరీల్లోని ప్రేక్షకులు, మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్లు నవ్వు ఆపుకోలేకపోయారు.

ఏం జరిగిందంటే..

ఓవల్ బౌలర్ రీస్ టోప్లీ వేసిన ఇన్నింగ్స్ 13 బంతి నేరుగా అలెక్స్ హేల్స్ ప్రైవేట్ పార్ట్‌కు బలంగా తాకింది. టోప్లీ వేసిన లెంగ్త్ బాల్‌ను మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నం చేసిన హేల్స్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో బ్యాట్‌ను మిస్సయిన బంతి అతని రహస్య ప్రదేశంలో బలంగా తాకింది. ఆ తాకిడికి హేల్స్ మైదానంలో కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడుతూ.. క్రీజులో అటు ఇటు దొర్లాడు. యోగసనాలు వేసాడు. ఇక హేల్స్ పరిస్థితిని తెలుసుకున్న ఫిజియోలు మైదానంలోకి పరుగెత్తుకొచ్చారు. అతనికి ప్రథమ చికిత్స చేయగా.. కోలుకొని బ్యాటింగ్‌కు సిద్దమయ్యాడు.

రెండో సారి కూడా

రెండో సారి కూడా

ఆ టోప్లీ వేసిన ఆ మరుసటి బంతి కూడా అతని బ్యాట్‌కు ఎడ్జ్ అయి అక్కడే తాకింది. మళ్లీ నొప్పితో హేల్స్ గట్టిగా అరిచాడు. అదే తరహా లెంగ్త్ బాల్‌ను ఓవర్ మిడ్ వికెట్ మీదుగా ఆడే ప్రయత్నం చేసిన హేల్స్.. బంతిని అంచనా వేయడంలో విఫలమై మళ్లీ తాకిచ్చుకున్నాడు. అయితే ఈ సారి బంతి బ్యాట్‌ను తాకి తగలడంతో కొంత ఊపిరి పీల్చుకున్నాడు. ఇక హేల్స్ పరిస్థితిని చూసి మైదానంలో ప్రతీ ఒక్కరు, గ్యాలరీలోని ప్రేక్షకులు సైతం నవ్వుకున్నారు.

ఓవర్ చివర్లో హేల్స్ సైతం తనకు జరిగింది తలుసుకొని చిరు నవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో హేల్స్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25)రాణించనప్పటికీ అతని జట్టు ట్రెంట్ రాకెట్స్‌కు ఓటమి తప్పలేదు.

జాసన్ రాయ్ మెరుపులు..

జాసన్ రాయ్ మెరుపులు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్.. నిర్ణీత 65 బంతుల్లో 6 వికెట్లకు 125 పరుగులు చేసింది. జాసన్ రాయ్( 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో మెరిసాడు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 65 బంతుల్లో 8 వికెట్లకు 116 పరుగులే చేసి 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

లూయిస్ గ్రేగరీ( 12 బంతుల్లో 28 నాటౌట్), అలెక్స్ హేల్స్(25) మినహా అంతా విఫలమయ్యారు. అలెక్స్ హేల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. 2018 సీజన్‌లో డేవిడ్ వార్నర్ నిషేధానికి గురవ్వడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు. 6 మ్యాచ్‌ల్లో 148 రన్స్ చేశాడు.

ది హండ్రెడ్ రూల్స్..

ది హండ్రెడ్ రూల్స్..

ఈ ఫార్మాట్‌లో ఓవర్లుండవు. కేవలం బంతుల ఆధారంగానే ఒక ఇన్నింగ్స్ ఉంటుంది. ఒక బౌల‌ర్ ఒకే ఎండ్ నుంచి రెండుసార్లు ఐదేసి బంతులు వేయాలి. తొలి ఐదు బంతులు పూర్తయ్యాక అంపైర్ ఓ వైట్ కార్డు చూపిస్తాడు. దాంతో ఒక సెట్ పూర్తయినట్లు. ఇందులో తొలి 25 బంతులు ప‌వ‌ర్ ప్లేగా నిర్ణయించారు. ఈ స‌మ‌యంలో 30 గ‌జాల స‌ర్కిల్ బ‌య‌ట ఇద్దరు ఫీల్డర్లు ఉంటారు. అలాగే, బ్యాట్స్‌మన్ క్యాచ్ ఔట్ అయితే.. అవ‌త‌లి బ్యాట్స్‌మ‌న్ క్రాస్ అయ్యాడా లేదా అనే సంబంధం లేకుండా కొత్త బ్యాట్స్‌మ‌న్ స్ట్రైక్ తీసుకుంటాడు.

గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌ టై అయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు. అదే ఎలిమినేట‌ర్‌, ఫైన‌ల్లో టై అయితే.. సూప‌ర్ ఫైవ్ ఆడాల్సి ఉంటుంది. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్‌ల‌కు అంతరాయం ఏర్పడితే కొత్త డీఎల్ఎస్ ప‌ద్ధతిని అమలుచేయనున్నారు. ఒకవేళ జట్టు స్లోగా బౌలింగ్ చేస్తుంద‌నుకుంటే అంపైర్‌కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. పెనాల్టీ విధించాల్సి వస్తే.. ఫీల్డింగ్ టీమ్‌కు స‌ర్కిల్ బ‌య‌ట ఒక ఫీల్డర్‌ను త‌గ్గించాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, August 10, 2021, 10:39 [IST]
Other articles published on Aug 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+