7 సిక్స్‌లతో టీమ్ సీఫెర్ట్ ఊచకోత.. చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్!(వీడియో)
న్యూజిలాండ్ బ్యాటర్ టీమ్ సీఫెర్ట్(40 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 80 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమ్ సీఫెర్ట్.. సన్‌రైజర్స్ లీడ్స్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7 సిక్స్‌లతో వీర విహారం చేశాడు. ఇందులో హ్యాట్రిక్ సిక్స్‌లు బాదడం గమనార్హం.
టీమ్ సీఫెర్ట్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ లీడ్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులు చేసింది.

మిచెల్ మార్ష్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), జాక్ క్రాలీ(28 బంతుల్లో ఫోర్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ మూడు వికెట్లు తీయగా.. సోనీ బేకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ టంగ్, లియామ్ డాసన్, నూర్ అహ్మద్, పాల్ వాల్టర్ తలో వికెట్ తీసారు.
అనంతరం మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 67 బంతుల్లో 128 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టీమ్ సీఫెర్ట్‌తో పాటు పాల్ వాల్టర్(28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) పర్వాలేదనిపించారు. టీమ్ సీఫెర్ట్ ధాటికి సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లు తేలిపోయారు. బ్రైడన్ కార్స్ వేసిన 7, 8, 9 బంతుల్లో టీమ్ సీఫెర్ట్ వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు.
ఈ లీగ్‌లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ కూడా 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. టేబుల్ టాపర్‌గా నిలిచిన ట్రెంట్ రాకెట్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ప్రస్తుతం టాప్-3లో ఉన్న సన్‌రైజర్స్ లీడ్స్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఎలిమినేటర్ మ్యాచ్ రేసులో ఉన్నా.. ఎంఐ లండన్, వెల్ష్ ఫైర్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్ ఫలితంపై వారి భవితవ్యం ఆధారపడి ఉంది. ఎంఐ లండన్ భారీ విజయం సాధిస్తే సన్‌రైజర్స్ లీడ్స్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

