Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఔట్.. ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్!

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న 'ది హండ్రెడ్ లీగ్‌ 2026' టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఎంఐ లండన్ 2 వికెట్ల తేడాతో బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌ను ఓడించినా ఎలిమినేటర్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. పేలవ రన్‌రేట్‌తో ఎంఐ లండన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన ట్రెంట్ రాకెట్స్ నేరుగా ఫైనల్‌ చేరగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ లీడ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్నాయి.

The Hundred 2026 Sunrisers Leeds Reach Eliminator After Birmingham Phoenix Knock Out MI London

మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ లీడ్స్ తరహాలోనే ముంబై లండన్ కూడా 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించింది. కానీ పేలవ రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుండగా.. ఆదివారం ఫైనల్ జరగనుంది.

ఎంఐ లండన్ గెలిచినా..

ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), జాసన్ రాయ్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బర్మింగ్‌హామ్ బౌలర్లలో క్రిస్ వుడ్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. టామ్ హెల్మ్, జోర్డాన్ థాంప్సన్ తలో వికెట్ తీసారు.

అనంతరం బర్మింగ్‌హామ్ 100 బంతుల్లో 7 వికెట్లకు 155 పరుగులే చేసి ఓటమిపాలైంది. జో మెదర్లీ(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్, సామ్ కరణ్ రెండేసి వికెట్లు తీయగా.. సికిందర్ రజా, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసారు.

టోర్నీ ఫార్మాట్ ఏంటంటే..?

ది హండ్రెడ్ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడుతాయి. లీగ్ దశలో ప్రతి టీమ్ మిగతా జట్లతో మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్' మ్యాచ్ జరగనుండగా.. గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఇంటిబాట పడుతుంది.

Story first published: Thursday, August 13, 2026, 9:50 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+