Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొంపముంచిన క్లాసెన్.. సన్‌రైజర్స్ ఔట్! ఫైనల్‌కు సూపర్ జెయింట్స్!

ది హండ్రెడ్ 2026 టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ లీడ్స్ 20 పరుగుల తేడాతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో సన్‌రైజర్స్ లీడ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అద్భుత విజయం సాధించిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్(46 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్స్‌లతో 80), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) విలువైన పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.

The Hundred 2026 Manchester Super Giants End Sunrisers Leeds Campaign With 20-Run Eliminator Win

అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. ర్యాన్ రికెల్టన్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్), హ్యారీ బ్రూక్(31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49) రాణించినా ఫలితం లేకపోయింది. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. సోనీ బేకర్(2/39) రెండు వికెట్లు పడగొట్టాడు. లియామ్ డాసన్‌కు ఒక వికెట్ దక్కింది.

కొంపముంచిన క్లాసెన్..

హెన్రీచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఆడే క్లాసెన్‌ను ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కాటేరమ్మ కొడుకుగా పిలుస్తారు. కానీ ఆ కాటేరమ్మ కొడుకే సన్‌రైజర్స్ జట్టును కాటేసాడు. ది హండ్రెడ్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న క్లాసెన్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు చేసి మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌‌కు భారీ స్కోర్ అందించాడు. క్లాసెన్ విఫలమై ఉంటే.. ఆ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది. అప్పుడు సన్‌రైజర్స్ లీడ్స్ గెలిచే అవకాశం ఉండేది.

సండే ఫైనల్..

మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ లీడ్స్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ లీడ్స్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఓడించింది. ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ గెలిచి ఉంటే నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించేది. ఎలిమినేటర్‌లోనూ ఆ జట్టు సన్‌రైజర్స్‌కు బిగ్ షాకిచ్చింది. ఆదివారం జరిగే ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తలపడనుంది. టేబుల్ టాపర్‌గా నిలిచిన ట్రెంట్ రాకెట్స్ నేరుగా ఫైనల్ చేరింది.

Story first published: Saturday, August 15, 2026, 9:13 [IST]
Other articles published on Aug 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+