వారికి ఉన్న సహనం విరాట్ కోహ్లీకి లేదు.. అందుకే ఇలా విఫలమవుతున్నాడు! భారత సారథిపై మండిపడ్డ మాజీ కోచ్!!

ముంబై: ఇంగ్లండ్ పర్యటనలో విఫలమవుతున్న భారత సారథి విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మండిపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్లు కోహ్లీ వికెట్ కోసం చూపిస్తున్న సహనాన్నీ అతడు ప్రదర్శించడం లేదన్నాడు. వదిలేయాల్సిన బంతులను ఆడుతూ అనవసరంగా విరాట్ వికెట్ ఇచ్చేస్తున్నాడని బంగర్ పేర్కొన్నాడు. పరుగులు చేయాలంటే కోహ్లీ కాస్త ఓపిక పట్టాలని అతడు సూచించాడు. కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు.
ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు అలవోకగా సాధించే కోహ్లీ.. గత 22 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో పర్వాలేదన్పిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

124 పరుగులే
కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ భారీ స్కోర్లు చేయడం లేదు. తన స్థాయికి దగ్గ ఇన్నింగ్స్ ఆడి ఎంతో కాలమైంది. శతకం బాది దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. అడపా దడపా అర్ధ శతకాలు చేసినా శతకాలు మాత్రం దక్కలేదు. ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్టుల్లో 24.80 సగటుతో 124 పరుగులే చేశాడు. జేమ్స్ అండర్సన్, ఒలీ రాబిన్సన్ బంతులకు ఔటవుతున్నాడు.
ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి మరీ స్లిప్ లేదా కీపర్‌కు క్యాచ్ ఇచ్చి భారత కెప్టెన్ పెవిలియన్ చేరుతున్నాడు. అందుకే అతడికి సహనం అవసరమని భారత దిగ్గజం సునీల్ గబాస్కర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ సహా సీనియర్లు చెబుతున్నారు. తాజాగా సంజయ్ బంగర్ కూడా ఆ జాబితాలో చేరాడు.

సహనం కోహ్లీకి లేదు
ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ వైఫల్యాలపై స్పందించాడు. 'నాకు సంబంధించినంత వరకు బాటమ్ లైన్ ఏమిటంటే.. ఇంగ్లండ్ పేసర్లు విరాట్ కోహ్లీ వికెట్ కోసం ఎంతో ఓపిక పడుతున్నారు. విరాట్ వికెట్ ఇచ్చేవరకు సహనంగా ఉంటున్నారు. కానీ అతడు మాత్రం వారు చూపింనంత సహనమూ ప్రదర్శించడం లేదు. అదే ఇక్కడ ప్రధాన తేడా' అని బంగర్ అన్నాడు. 'ఆసియాలో కోహ్లీ విలక్షణమైన ఆటగాడు.
విరాట్ ఆస్ట్రేలియాలో కూడా బాగా ఆడగలడు. కానీ ఇంగ్లండ్, దక్షిణఫ్రికా వంటి దేశాల్లో బంతి స్వింగ్ లేదా సీమ్ అయినపుడు ఇబ్బంది పడుతున్నాడు. అవుట్ స్వింగర్లను అతడు బాదుతాడు' అని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అకిబ్ జావెద్ పేర్కొన్నాడు.
Tokyo Paralympics 2020: తగ్గిన అవని లేఖారా జోరు.. మిక్స్‌డ్ షూటింగ్‌లో విఫలం!!

సాంకేతిక లోపాలున్నాయి
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో కొన్ని సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయని ఆకాష్ చోప్రాకు సంజయ్ బంగర్ వివరించాడు. 'బంతిని డిఫెండ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ ఎక్కువగా ఔటవ్వడం లేదు. బయటకు వెళ్తున్న బంతిని వెంటాడినప్పుడే వికెట్ ఇస్తున్నాడు. 2014 నుంచి కోహ్లీ ఔటైన విధానం గమనిస్తే.. డ్రైవ్స్ చేస్తున్నప్పుడు తక్కువగానే ఔటవుతున్నాడు. అతడు ఎక్కువగా ఆరు, ఏడో స్టంప్ లైన్ బంతులు ఆడుతున్నాడు. నిజానికి అవి ఆడాల్సిన అవసరం లేదు. బౌలర్ బంతి వదిలినప్పుడు అతడు తన పొజిషన్ చూసుకోవాలి. ఇప్పటికైనా కోహ్లీ తప్పులు సరిదిద్దుకుంటే సరిపోతుంది. ఇంకా రెండు టెస్టులు ఉన్నాయి' అని బంగర్ చెప్పుకొచ్చాడు.

సెంచరీల కరువు తీర్చుకుంటాడో లేదో
2014లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడిన విరాట్ కోహ్లీ ఆ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. 5 టెస్ట్‌ల్లో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. జేమ్స్ అండర్సన్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఎక్కువగా ఔటయ్యాడు. కానీ 2018 పర్యటనలో మాత్రం పరుగుల వరద పారించాడు. 5 టెస్ట్‌ల్లో 59.30 సగటుతో 593 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే 2021 పర్యటనలో మరోసారి విఫలమవుతున్నాడు. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టులో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంకా రెండు టెస్టులు ఉన్న నేపథ్యంలో కోహ్లీ గాడిలో పడుతాడేమో చూడాలి. సెంచరీల కరువు తీర్చుకుంటాడో లేదో చూడాలి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications