Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ నో బాల్.. మా కొంపముంచింది: రుతురాజ్ గైక్వాడ్

విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్.. అన్షుల్ కంబోజ్ వేసిన నోబాల్ తమ పతనాన్ని శాసించాయని చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. కోహ్లీ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ మూమెంటమ్ తమ వైపు ఉండేదని, అన్షుల్ నోబాల్ వేయకుండా ఉంటే డేంజరస్ టీమ్ డేవిడ్ ఔటయ్యేవాడని గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 43 పరుగుల తేడాతో సీఎస్‌కే‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో సీఎస్‌కు ఇది హ్యాట్రిక్ పరాజయం. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. టాపార్డర్ వైఫల్యంతో పాటు నో బాల్ తప్పిదం తమ ఓటమికి కారణమని తెలిపాడు.

నేను ఆడాల్సింది..

'నిజం చెప్పాలంటే.. మా బ్యాటింగ్ విధానం చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, కొంతవరకు శివమ్ దూబే కూడా చాలా అద్భుతంగా పోరాడారు. బహుశా టాప్ ఆర్డర్‌లో నేను ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే మేం ఈ లక్ష్యాన్ని ఛేదించేవాళ్లమేమో.

అన్షుల్ కంబోజ్ దాదాపు టీమ్ డేవిడ్‌ను ఔట్ చేశాడు. కానీ అది నో బాల్ కావడం దురదృష్టకరం. ఆ తర్వాత అతను బంతి నలుమూలలు బాదేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన టీమ్‌ డేవిడ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మా ఫీల్డింగ్ కూడా మెరుగవ్వాలి. ఇన్నింగ్స్ ఆరంభంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ మూమెంటమ్ మా వైపు మళ్లేది. అయినప్పటికీ 13- 14వ ఓవర్ వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు మొమెంటం పూర్తిగా మారిపోయింది.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.

That No-Ball Cost Us CSK Captain Ruturaj Gaikwad Points to Anshul Kamboj s Illegal Delivery in Loss to RCB
Photo Credit: screen grab for JioHotstar

కొంపముంచిన నోబాల్..

అన్షూల్ కంబోజ్ వేసిన నోబాల్ ఈ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అతను వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి డేంజరస్ టీమ్ డేవిడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ బంతి నో బాల్ కావడంతో అతను ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి అతను చేసింది 28 పరుగులే. కానీ ఈ అవకాశంతో టీమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా 8 భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను పూర్తిగా లాగేసుకున్నాడు.

కుప్పకూలిన సీఎస్‌కే..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమ్ డేవిడ్‌తో పాటు దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీ రాణించాడు. రజత్ పటీదార్(19 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 48 నాటౌట్), ఫిల్ సాల్ట్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), విరాట్ కోహ్లీ(18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జెమీ ఓవర్టన్, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సర్ఫరాజ్ ఖాన్(25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ప్రశాంత్ వీర్(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 43) , జెమీ ఓవర్టన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పోరాడారు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, కృనాల్ పాండ్యా, అభినందన సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సుయాశ్ శర్మ‌కు ఒక వికెట్ దక్కింది.

Story first published: Monday, April 6, 2026, 0:11 [IST]
Other articles published on Apr 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+