Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni Retirement: ట్రెండింగ్‌లో థాంక్యూ మహీ.. ఇక క్రికెట్‌ చూడనంటున్న ఫాన్స్!!

#ThankYouDhoni trends on Twitter as MS Dhoni announces his retirement

హైదరాబాద్: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించి, అంత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా రికార్డుల్లోకి ఎక్కాడు. దుబాయిలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు‌ సన్నద్ధమవుతున్న ధోనీ.. భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున శనివారం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అనూహ్యంగా వైదొలడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ట్రెండింగ్‌లో థాంక్యూ మహీ

ట్రెండింగ్‌లో థాంక్యూ మహీ

రిటైర్మెంట్‌ సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు ఎంఎస్ ధోనీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. అభిమానులే కాదు ధోనీ సహచర క్రికెటర్లు కూడా అతనితో తమకి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. #ThankYouMahi, #ThankYouDhoni అనే హ్యాష్‌టాగ్‌తో అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ఈ హ్యాష్‌టాగ్‌లు ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. మహీతో పాటే టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేష్‌ రైనా కూడా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం బాధగా ఉందని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు.

ఇక నుంచి క్రికెట్‌ చూడను

ఇక నుంచి క్రికెట్‌ చూడను

ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఆటను ఆస్వాదించేందుకే క్రికెట్‌ చూస్తానని, ఇక నుంచి క్రికెట్‌ చూడబోనని ఓ అభిమాని వెల్లడించాడు. ఇక నుంచి ఐపీఎల్‌లో ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లు మాత్రమే వీక్షిస్తానని సదరు అభిమాని పేర్కొన్నాడు. ధోనీ, రైనా ఒకేసారి ఆటకు స్వస్తి చెప్పడంతో.. గుండె పగిలినట్టయిందని బీజేపీ యువజన మోర్చాకు చెందిన శివలిక అంబానీ పేర్కొన్నారు. వారిద్దరు గొప్ప గొప్ప భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిడింయాను విజయతీరాలకు చేర్చానని గుర్తుచేశారు.

అభిమానులు గుండెల్లో హీరోనే

అభిమానులు గుండెల్లో హీరోనే

ఎంఎస్ ధోనీ లాంటి కెప్టెన్‌ టీమిండియాకు ఎప్పటికీ దొరకడని మరో అభిమాని ట్వీట్ చేశాడు. ఎప్పటికీ అభిమానులు గుండెల్లో నువ్‌ హీరోనే అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు. ఆట నుంచి రిటైర్‌ అయినా.. మా గుండెల్లో చిరకాలం ఉంటావని ఇంకో అభిమాని తన ప్రేమని చాటుకున్నారు. 33 ఏళ్ల రైనా కూడా ఆటకు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, భారత క్రికెట్‌కు ఇదొక చేదు రోజని మరో క్రికెట్‌ ప్రేమికుడు అన్నాడు.

ఎవరీకి సాధ్యం కానీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌

ఎవరీకి సాధ్యం కానీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌

భారత క్రికెట్‌కు ఎన్నో మధురానుభూతులను అందించిన ఎంఎస్ ధోనీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. క్రికెట్‌ ప్రపంచంలో ఎవరీకి సాధ్యం కానీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. భారత జట్టులోని సభ్యులే కాదు, ప్రత్యర్థులు కూడా అతడికి అభిమానులే. నరాలు తెగే ఉత్కంఠ, ఒత్తిడిలోనూ మహీ చాలా ప్రశాంతగా ఉంటాడు. జట్టులో ఉన్న వనరులను ఎలా ఉపయోగించాలో అతడికే బాగా తెలుసు. ఏ ఆటగాడు ఎలా ఆడతాడు? అతడ్ని ఎలా బురిడి కొట్టించాలో ముందుగానే అతను పసిగట్టేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెట్‌లో అతడో అపర చాణుక్యుడు.

'షాట్లు ఆడేందుకు పాక్ బ్యాట్స్‌మెన్‌ భయపడుతున్నారు'

Story first published: Sunday, August 16, 2020, 15:07 [IST]
Other articles published on Aug 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+