Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో థాయ్‌లాండ్‌ సరికొత్త రికార్డు.. ఆసీస్‌ రికార్డు బద్దలు

Thailand Women Cricket Team break T20I record with 17th successive win

అమెస్టర్‌డామ్‌: అంతర్జాతీయ టీ20లలో సరికొత్త రికార్డు నమోదయింది. థాయ్‌లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు వరుసగా 17వ టీ20 విజయాన్ని నమోదు చేసి ప్రపంచ రికార్డును తిరిగరాసింది. క్వాడ్రాంగులర్‌ సిరీస్‌లో భాగంగా శనివారం ఆతిధ్య నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 17వ విజయాన్ని థాయ్‌లాండ్‌ తన ఖాతాలో వేసుకుంది.

ఆసీస్‌ రికార్డు బద్దలు:

17వ విజయంతో ఆసీస్‌ మహిళల జట్టుపై ఉన్న 16 విజయాల రికార్డును థాయ్‌లాండ్‌ మహిళల జట్టు బద్దలు కొట్టింది. 2018 జూలై నుంచి ఇప్పటివరకూ థాయ్‌లాండ్‌ విజయాల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆసీస్‌ మార్చి 2014 నుండి 2015 వరకు 16 విజయాలను నమోదు చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్, జింబాంబ్వే సంయుక్తంగా 14 వరుస విజయాలతో ఆసీస్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ (12) విజయాలు నమోదు చేసింది.

జింబాబ్వేకు అవకాశం:

జింబాబ్వేకు అవకాశం:

నెదర్లాండ్స్‌లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ 20 క్వాలిఫైయర్‌ రెండో ప్లేఆఫ్ సెమీస్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళలను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన థాయిలాండ్.. తన విజయాల పరంపరను ప్రారంభించింది. ఈ 17 విజయాలలో యూఏఈని గరిష్టంగా మూడుసార్లు ఓడించింది. ప్రస్తుతం జింబాబ్వే 14 విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో థాయ్‌లాండ్ రికార్డును జింబాబ్వే సమం చేసే అవకాశం ఉంది.

అభిమానులకు శుభవార్త.. రెండో వన్డేకు వరణుడి ముప్పు లేనట్టే!!

మొదటి స్థానంలో అఫ్గానిస్తాన్‌:

మొదటి స్థానంలో అఫ్గానిస్తాన్‌:

శనివారం జరిగిన మ్యాచులో తొలుత నెదర్లాండ్స్‌ను 54 పరుగులకే కూల్చిన థాయ్‌లాండ్‌.. లక్ష్య చేధనను ఎనిమిది ఓవర్లలో పూర్తి చేశారు. థాయ్‌లాండ్‌ పేసర్ నత్తయా బూచటం మూడు వికెట్లు తీసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేశారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన లియోనీ బెన్నెట్ (16) టాప్ స్కోరర్. ఇక పురుషుల క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ 11 వరుస విజయాలతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్‌ 9 విజయాలతో రెండో స్థానంలో ఉంది.

Story first published: Sunday, August 11, 2019, 16:10 [IST]
Other articles published on Aug 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+