TG20 League: తిలక్ వర్మ సెంచరీ.. 21 బౌండరీలతో విధ్వంసం!
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీజీ20) 2026 సీజన్‌లో మెదక్ ఫాల్కన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. సోమవారం వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించాడు.
శ్రీలంక పర్యటనను ముగించుకొని సోమవారం ఉదయమే హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ.. వెంటనే ఉప్పల్ మైదానం చేరుకొని తొలి మ్యాచ్ ఆడాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు,7 సిక్స్‌లతో 136 పరుగులతో అజేయంగా నిలిచి మెదక్ ఫాల్కన్స్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.

అమన్ రావ్ శతకం వృథా..
తిలక్ వర్మ విధ్వంసంతో 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేధించింది. మరో 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. తిలక్ వర్మకు తోడుగా విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కురకర్ణి, మన్సూరి తలో రెండు వికెట్లు తీసారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. వరంగల్ కెప్టెన్ అమన్ రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ శతకంతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ, మధుకర్ రెండేసి వికెట్లు తీయగా.. సూర్యతేజ, రవి తేజ, రాహుల్ చెరో వికెట్ పడగొట్టారు.
రంగా రెడ్డి శుభారంభం..
టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో నల్గొండ నైట్స్‌ను ఓడించింది. తనయ్ త్యాగరాజన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రంగారెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 189 పరుగులు చేసింది.
దివేశ్ సింగ్(27 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 48), హర్షవర్దన్(20 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్),రాహుల్ బుద్ది(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) రాణించారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య 3 వికెట్లు తీయగా.. కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు వికెట్లు తీసారు. అనంతరం రంగారెడ్డి 16.3 ఓవర్లలో 5 వికెట్లకు 190 పరుగులు చేసి గెలుపొందింది. తనయ్ త్యాగరాజన్‌తో పాటు ఆదిత్య(41),నితిన్ సాయి(26 నాటౌట్) రాణించారు. అనికేత్, వరుణ్ గౌడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

