TG20 League: ఫైనల్లో ఖమ్మం.. రంగారెడ్డి ఔట్!
తెలంగాణ ప్రతిష్టాత్మక టీ20 లీగ్ టీజీ20 టోర్నీలో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఖమ్మం హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌ను 10 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. సాయికృష్ణా రెడ్డి(30 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), పరాస్ రాజ్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
హైదరాబాద్ బౌలర్లలో అఖిల్ రాథోడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఈ ఛాంపియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి వికాస్(27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69) ఒక్కడే మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు.

తన్మయ్ సెంచరీ..
అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్.. 75 పరుగుల భారీ తేడాతో రంగారెడ్డి రైజర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్(61 బంతుల్లో 11 ఫోర్లు, 10 సిక్స్‌లతో 137) మూడో సెంచరీ నమోదు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. హృషికేశ్ సింహా(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్యన్ కరియప్ప రెండు వికెట్లు తీసాడు.
లక్ష్య ఛేదనలో రంగా రెడ్డి.. ఆశిష్ శ్రీవాత్సవ్(5/16), శుభమ్ శర్మ(2/14) ధాటికి రైజర్స్ 16.3 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ త్యాగరాజన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63) దూకుడుగా ఆడినా మరో ఎండ్ నుంచి అతనికి సహకారం లభించలేదు. నితిన్ సాయి(30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. రత్లావత్ దినేశ్, నారయణ తేజ, సతీష్ కుమార్ తలో వికెట్ తీసారు. 465 పరుగులతో తన్మయ్ అగర్వాల్ ఆరెంజ్ క్యాప్‌ను ఖాయం చేసుకున్నాడు. క్వాలిఫయర్-1లో ఓడిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో నేడు(జూలై 10) కరీంనగర్ క్వాలిఫయర్-2 ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

