Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి రివర్స్ స్వీప్ షాట్ రా అయ్యా! (వీడియో)

తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎఫ్‌ఐ క్రికెట్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీకి సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఓవర్‌త్రోకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేయగా.. తాజాగా ఓ బ్యాటర్ ఆడిన రివర్స్ స్వీప్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు చెందిన రోరింగ్ రెబెల్స్, అక్కినేని నాగర్జున అభిమానులకు చెందిన నాగ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సరదా ఘటన చోటు చేసుకుంది.

TFI Fans Cricket: Crazy video of TFI cricket goes Viral

పేస్ బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ సింగిల్ హ్యాండ్‌తో రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. కానీ బ్యాటర్ ప్రయత్నం నవ్వులు పూయించింది. ఈ షాట్‌ను వివరిస్తూ కామెంటేటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ షాట్ అంటూ వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్‌లో రోరింగ్ రెబెల్స్ 126 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రోరింగ్ రెబల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులు చేసింది. రెబల్స్ టీమ్‌లో మహమ్మద్ ఇమ్తియాజ్(47 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 121) శతక్కొట్టగా.. లక్కీ(21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నాగ్ కింగ్స్ 14.4 ఓవర్లలోనే 120 పరుగులకు కుప్పకూలింది.

తెలుగు హీరోల అభిమానులంతా 12 జట్లుగా విడిపోయి టీఎఫ్‌ఐ ఫ్యాన్స్ క్రికెట్ టీ20 టోర్నీ ఆడుతున్నారు. 12 జట్లను మొత్తం నాలుగు గ్రూప్‌లుగా విభిజించారు. గురువారం (జనవరి 29) ప్రారంభమైన ఈ టోర్నీ ఫిబ్రవరి 2 (ఆదివారం)న ముగియనుంది. గ్రూప్-ఏలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ టీమ్స్ ఉండగా.. గ్రూప్ బీలో చిరంజీవి రవి తేజ, గ్రూప్ సీ‌లో నాగర్జున, మహేశ్ బాబు, ప్రభాస్, గ్రూప్-డీలో వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల టీమ్స్ ఉన్నాయి.

ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 3 లక్షలు, రన్నరప్‌కు రూ.లక్ష క్యాష్ రివార్డు‌గా లభించనుంది. హైదరబాద్‌లోని ఆజిజ్ నగర్‌లోని ఏఎమ్ క్రికెట్ గ్రౌండ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీకి పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ప్రచారం చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది. పైగా తమ అభిమాన హీరోల పేర్ల మీద టీమ్స్ ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఈ టోర్నీకి క్రేజ్ నెలకొంది. యూట్యూబ్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్షప్రసారం కూడా అవుతున్నాయి.

Story first published: Thursday, February 1, 2024, 13:58 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+