
ప్రస్తుత టెస్టు జట్టులో సభ్యుడిగా
విహారీ తన రంజీ క్రికెట్ కెరీర్‌లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ప్రస్తుత టెస్టు జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. ప్రీతిరాజ్ ఫ్యాషన్ డిజైనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాలో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేశాడు విహారీ. ఇంగ్లాండ్‌లోని ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు ఓవల్ వేదికగా జరిగింది.
రెండో వన్డే: వైజాగ్ స్టేడియం అంత ప్రత్యేకమా..?

292వ ఆటగాడిగా హనుమ విహారి రికార్డుల్లోకి
ఈ టెస్టులో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు లభించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ హనుమ విహారికి చోటు కల్పించింది. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదగా హనుమ విహారి టెస్టు క్యాప్‌ని అందుకున్నాడు. తద్వారా భారత్‌కు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న 292వ ఆటగాడిగా హనుమ విహారి రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ సంఘం తరపున ఆడుతున్న విహారి హైదరాబాద్ నుంచే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

తండ్రి సింగరేణిలో సూపరింటెండెంట్‌గా
తాజాగా, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్న విహారి పూర్తి పేరు గాదె హనుమ విహారి. 1993 అక్టోబర్ 13న కాకినాడలో జన్మించాడు. తండ్రి సత్యనారాయణ సింగరేణిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండడంతో పుట్టిన కొద్ది రోజులకే విహారి అక్కడికి వెళ్లిపోయాడు. మూడో తరగతి వరకు గోదావరిఖని, మణుగూరులలోను, ఆ తరువాత హైదరాబాద్‌లోను చదువు కొనసాగించాడు.

రెండేళ్లుగా తూ.గో జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ
క్రికెట్‌లో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి విహారి ఎదగగలిగాడు. 2012 అండర్-19 ప్రపంచ కప్ జట్టులో తొలిసారిగా స్థానం పొందాడు. ఆ తరువాత రంజీ పోటీల్లో మరింతగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 59.45 అత్యధిక సగటుతో ప్రపంచ క్రికెట్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న విహారి రెండేళ్లుగా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తూ టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. రెండేళ్లుగా భారత్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో విహారి నిలకడగా రాణిస్తున్నాడు.


Click it and Unblock the Notifications













