Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs NZ: వారెవ్వా.. స్లిప్‌లోనే ఆరుగురు ఫీల్డర్లు.. బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్! ఫ్యాన్స్ ఫిదా!

Test cricket fans delighted after England field six slips at Lord’s against New Zealand

లార్డ్స్: మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ అనేక మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతోంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో తొలి రోజే 17 వికెట్లు కుప్పకూలగా.. మ్యాచ్‌ రెండున్నర రోజుల్లోనే ముగిస్తుందని అంతా భావించారు. కానీ రెండో రోజు న్యూజిలాండ్ బ్యాటర్ల అద్భుత పోరాటంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్.. ఆ వెంటనే తమ బౌలింగ్ బలంతో ఆతిథ్య జట్టును 141 పరుగులకే పరిమితం చేసింది.

పటిష్టంగా న్యూజిలాండ్..

ఇక 9 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్.. 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినా.. డారిల్‌ మిచెల్‌ ( 188 బంతుల్లో 11 ఫోర్లతో 97 బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌ (182 బంతుల్లో 12 ఫోర్లతో 90 బ్యాటింగ్‌) గొప్ప పోరాటంతో పటిష్ట స్థితిలో నిలిచింది. వీళ్లిద్దరూ 180 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 79 ఓవర్లలో 4 వికెట్లకు 236 పరుగులు చేసింది.

స్లిప్‌లో ఆరుగురు ఫీల్డర్లు..

అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నేట్‌ను షేక్ చేస్తుంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అదేంటంటే.. న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా ఇంగ్లండ్.. స్లిప్‌లోనే ఆరుగురు ఫీల్డర్లను పెట్టి బౌలింగ్ చేయించడం. పచ్చని లార్డ్స్ మైదానంలో ఇసుకేస్తే రాలనంత కిక్కిరిసిన జన సందోహంలో ఆరుగురు స్లిప్ ఫీల్డర్లును టాప్ వ్యూ నుంచి తీసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మెక్‌కల్లమ్ స్ట్రాటజీస్..

మెక్‌కల్లమ్ స్ట్రాటజీస్..

జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఆరుగురి ఫీల్డర్లను పెట్టి ఫలితం రాబట్టారు. ఇంగ్లండ్ కోచ్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఆలోచనా విధానం ఆ జట్టుకు కలిసొచ్చింది. న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్‌తో పాటు మరికొందరూ స్లిప్‌లోనే చిక్కారు. జానీ బెయిర్ స్టో ఏకంగా మూడు క్యాచ్‌లు పట్టాడు. స్లిప్‌లోనే ఆరుగురు ఫీల్డర్లను పెట్టడం చాలా అరుదు. అయితే గతంలో 9 మంది ఫీల్డర్లను పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి.

బ్యూటీ ఆఫ్ క్రికెట్..

బ్యూటీ ఆఫ్ క్రికెట్..

మెక్ కల్లమ్ తాను ఆడే రోజుల్లో న్యూజిలాండ్ కెప్టెన్‌‌గా ఇలాంటి ఫీల్డ్ సెటప్స్ బాగా పెట్టేవాడు. అతను వన్డేల్లో కూడా ఈ సాహసం చేశాడు. ఇక గత 17 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒకే ఒక్కటి గెలిచిన ఇంగ్లండ్.. ఆ చెత్త రికార్డును చెరపేసుకునే పనిలో పడింది. వరుస విజయాలతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ రేసులో ఉండాలనే పట్టుదలతో ఉంది.

ఇక ఆరుగురిని స్లిప్‌లో పెట్టడాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ ఫొటోనూ షేర్ చేస్తున్నారు. 'ఆకట్టుకునే ఇంగ్లీష్ వాతావరణం, కిక్కిరిసిన జన సందోహం, స్లిప్‌లో ఆరుగురి ఫీల్డర్లు, జేమ్స్ అండర్సన్ అద్భుత బౌలింగ్.. టెస్ట్ క్రికెట్ బ్యూటీ అంటే ఇదే కదా'అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Story first published: Saturday, June 4, 2022, 11:19 [IST]
Other articles published on Jun 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+